హుజూరాబాద్ ఒక్క‌ ఎన్నిక ఎన్నో గుణపాఠాలు..!

విధాత‌: తెలంగాణలో ఉప ఎన్నిక జ‌రిగిన హుజూరాబాద్ ఫ‌లితాలు దేనికి సంకేతం? ఈట‌లకు గెలుపు అయితే ఓట‌మి ఎవ‌రికి? ఇన్‌ఛార్జ్‌గా ఉన్న హ‌రీష్‌రావుదా? టీ ఆర్ ఎస్ పార్టీదా? కేసీఆర్, కేటీఆర్‌ల‌దా? లేక కేసీఆర్ కుటుంబీకుల‌పైన ఉన్న‌, జ‌రుగుతున్న ప్ర‌చారం ఫ‌లిత‌మా? హుజూరాబాద్ ఎన్నిక‌ను అంచ‌నా వేయ‌డానికి దానికంటే ముందు ఇలాంటి ప‌రిస్థితుల్లోనే జ‌రిగిన మ‌రో రెండు ఎన్నిక‌ల‌ను ఒక‌సారి గుర్తు చేసుకోవాలి. 2001 సిద్ధిపేట ఉప ఎన్నిక‌లుచంద్ర‌బాబునాయుడు ప్ర‌భుత్వంలో కేసీఆర్‌కు మ‌ర్యాద లేద‌న్న కార‌ణంగా 2001లో […]

హుజూరాబాద్ ఒక్క‌ ఎన్నిక ఎన్నో గుణపాఠాలు..!

విధాత‌: తెలంగాణలో ఉప ఎన్నిక జ‌రిగిన హుజూరాబాద్ ఫ‌లితాలు దేనికి సంకేతం? ఈట‌లకు గెలుపు అయితే ఓట‌మి ఎవ‌రికి? ఇన్‌ఛార్జ్‌గా ఉన్న హ‌రీష్‌రావుదా? టీ ఆర్ ఎస్ పార్టీదా? కేసీఆర్, కేటీఆర్‌ల‌దా? లేక కేసీఆర్ కుటుంబీకుల‌పైన ఉన్న‌, జ‌రుగుతున్న ప్ర‌చారం ఫ‌లిత‌మా? హుజూరాబాద్ ఎన్నిక‌ను అంచ‌నా వేయ‌డానికి దానికంటే ముందు ఇలాంటి ప‌రిస్థితుల్లోనే జ‌రిగిన మ‌రో రెండు ఎన్నిక‌ల‌ను ఒక‌సారి గుర్తు చేసుకోవాలి.

  1. 2001 సిద్ధిపేట ఉప ఎన్నిక‌లు
    చంద్ర‌బాబునాయుడు ప్ర‌భుత్వంలో కేసీఆర్‌కు మ‌ర్యాద లేద‌న్న కార‌ణంగా 2001లో కే. చంద్ర‌శేఖ‌ర్‌రావు సిద్ధిపేట నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేప‌ద‌వికి రాజీనామా చేశారు. దాని ఉప ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబునాయుడు అండ్ కో కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా అనేక ప్ర‌చారాలు చేశారు. మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌నందుకే తెలంగాణ గానం అందుకున్నాడ‌ని, గెలిచాక స్పీక‌ర్ ప‌ద‌వి ఇచ్చినా తిరిగి టిడిపిలోకి వ‌చ్చేస్తార‌ని ఊరూరా ప్ర‌చారంచేశారు. మీడియాలో క‌థ‌నాలు అల్లించారు. అప్ప‌ట్లోనే సుమారు 30 కోట్ల రూపాయ‌లు టిడిపి అభ్య‌ర్థిని గెలిపించ‌డానికి ఖ‌ర్చు పెట్టార‌ని చెబుతారు. ఇలా తెలుగుదేశం అభ్య‌ర్థి త‌ర‌ఫున డ‌బ్బును పంచ‌డానికి వెళ్లింది కూడా ఇప్పుడు టీఆర్ ఎస్‌లోమంత్రిగా ఉన్న‌త‌ల‌సానిశ్రీ‌నివాస‌యాద‌వే. ఆయ‌నప్పుడు టిడిపిలో ఉన్నారు. డ‌బ్బుపంచుతున్న శ్రీ‌నివాస‌యాద‌వ్‌ను సిద్ధిపేట నియోజ‌క‌వ‌ర్గంలోని తెలంగాణ‌వాదులు ఉరికించి ఊళ్లు దాటించారు. ఆ ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఘ‌న విజ‌యం సాధించారు.
  2. 2006 లో క‌రీంన‌గ‌ర్ లోక్‌స‌భ ఉప ఎన్నిక‌
    ఇక వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సీఎం అయ్యాక‌… అప్ప‌టి పిసిసి అధ్య‌క్షుడు ఎం. స‌త్య‌నారాయ‌ణ రావు వ్యాఖ్య‌ల‌కు రెచ్చిపోయి కేసీఆర్ క‌రీంన‌గ‌ర్ లోక్‌స‌భ‌కు రాజీనామా చేశారు. అక్క‌డ అప్పుడు ఉప ఎన్నిక వ‌చ్చింది. ఆ ఉప ఎన్నిక‌లోతెలంగాణ ప్ర‌భావం లేద‌ని రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్ర‌భుత్వం రుజువు చేయ‌డానికి సుమారు 150 కోట్లు ఖ‌ర్చు పెట్టింద‌ని చెబుతారు. కానీ జ‌నం కేసీఆర్ను భారీ మెజార్టీతో గెలిపించారు. తెలంగాణ‌వాదం ఉంద‌ని నిరూపించారు.

ఇక ఇప్పుడు 2021 హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల విష‌యానికొద్దాం…

హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో అధికార ప‌క్షం సుమారు 500 కోట్లు ఖ‌ర్చు పెట్టిందని ఈటెల రాజేంద‌రే ఫ‌లితాల త‌ర్వాత చెప్పారు. ఆయ‌న అంచ‌నాలు త‌ప్పు అన‌లేము. ఈటల ఆయ‌న అనుచ‌రులు చెబుతున్న చెప్పే లెక్క‌లు ప్ర‌కార‌మే….తెలంగాణ‌ ప్ర‌భుత్వం త‌ర‌ఫున కూడా ద‌ళిత బంధుకు 2000 వేల కోట్లు కేటాయించారు. యాద‌వుల గొర్రెల ప‌థ‌కానికి, చాక‌లి, మంగ‌ళి వంటి బీసీ కులాల‌కు వివిధ ప‌థ‌కాల పేరుతో డ‌బ్బు పంపిణీ చేశారు. ఇదే త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్ మంత్రి హోదాలో వెళ్లి యాద‌వుల‌కు గొర్రెల‌ను పంపిణీ చేశారు హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో. ఒక్కో ద‌ళిత కుటుంబానికి 10 ల‌క్ష‌లు కేటాయించారు. ఇవ‌న్నీ చాల‌వ‌న్న‌ట్లు ఓటుకు 6 వేలు చొప్పున చాలామందికి పంచారంటున్నారు. ఈట‌ల రాజీనామా చేయ‌గానే ఈట‌ల కోట‌రీలో ఉండ‌కుండా హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని ఒక్కో స‌ర్పంచ్‌కు 5 ల‌క్ష‌లు, ఎంపీటీసీకి 3 ల‌క్ష‌లు, ఎంపీపీకి 10 ల‌క్ష‌లు, జ‌డ్పీటీసీకి 15 ల‌క్ష‌లు, మున్సిప‌ల్ చైర్మ‌న్‌కు ఇన్నోవా కార్లు, కౌన్సిల‌ర్ల‌కు 5 ల‌క్ష‌లు పంపిణీ చేశార‌ని టిఆర్ ఎస్ లోనే ఒక ముఖ్య నాయ‌కుడు పిచ్చాపాటిగా మాట్లాడుతూ జ‌ర్న‌లిస్టుల ముందు నోరు జారార‌ట‌. ఇలా డ‌బ్బులు పంపిణీచేసి ఈట‌ల‌కు ఆయ‌న అనుచ‌రులుగా ఉన్న‌వారంద‌రినీ రాజ‌కీయంగా దూరం చేశారు. ఉప ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చినప్ప‌టి సంది రోజూ ఊరూరా మందు-విందు దావ‌త్‌లు పేరుతో కోట్లు ఖ‌ర్చు పెట్టారని అంటున్నారు.
ఈటల రాజేంద‌ర్ కూడా ఈ ఎన్నిక‌ల్లో సుమారు 130 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చుపెట్టి ఉంటార‌ని చెబుతున్నారు. ఓటుకు 1500 రూపాయ‌ల చొప్పున నియోజ‌వ‌ర్గంలోని ఓట‌ర్లంద‌రికీ ఈటల టోకుగా పంచార‌ట‌. అధికార పార్టీ మాత్రం ఓటుకు 6 వేల చొప్పున కొంద‌రికీ పంపిణీ చేసింద‌ని చెబుతున్నారు. అందుకే డ‌బ్బు అంద‌ని ఓట‌ర్లు రోడ్డెక్కార‌ని అంటున్నారు. ఇది కూడా అధికార పార్టీకి నెగ‌టివ్ అయింద‌ని చెబుతున్నారు. కానీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఈట‌ల 23 వేల పైచిలుకు మెజార్టీతో గెలుపు సాధించారు.

హుజూరాబాద్ ఫ‌లితాలు చెబుతున్న‌దేమిటి?

హుజూరాబాద్ ఫ‌లితాల‌ను తెలంగాణ‌లో ఒక ల్యాండ్ మార్క్ విక్ట‌రీగా అభివ‌ర్ణించ‌వ‌చ్చు. తెలంగాణ సాధ‌న‌కు ముందు సిద్ధిపేట‌,క‌రీంన‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల‌కు ఎంత ప్రాధాన్య‌త ఉందో, తెలంగాణ సాధ‌న అనంత‌రం రెండోసారి కేసీఆర్ అధికారం చేప‌ట్టాక జ‌రిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కుకూడా అంతే చ‌రిత్ర ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు ఎలా ఉండ‌బోతున్నాయో చెప్ప‌డానికి ఇదొక కేస్ స్ట‌డీగా భావించాల్సి ఉంటుంది. ఈ ఫ‌లితాలు పార్టీలు,నాయ‌కులు ఎలా ఉండాలో, ఎలా ఉండ‌కూడ‌దో, ఏం చేయ‌కూడ‌దో, ఎలాంటి త‌ప్పుదాలు చేశారో, చేస్తున్నారో చెప్ప‌క‌నే చెప్పాయి. అవి దిద్దుకుని భ‌విష్య‌త్‌ను తిరిగి పునఃనిర్మించుకునే అవ‌కాశం కూడా అధికార పార్టీకి ఈ ఫ‌లితాలు చిన్న‌పాటి హెచ్చ‌రిక ద్వారా చెప్ప‌క‌నే చెప్పాయి. హుజూరాబాద్ ప్ర‌జాతీర్పును ప్రామాణికంగా తీసుకుని ఎవ‌రు ఎలా ప్ర‌వ‌ర్త‌నల్లో మార్పులు చేసుకోవాల‌న్న‌ది వారి వారి విజ్ఞ‌త‌కు సంబంధించిన విష‌యం.

హుజూరాబాద్ ప్ర‌జ‌లు కూడా నాటి సిద్ధిపేట ప్ర‌జ‌ల్లాగా, క‌రీంన‌గ‌ర్ ప్ర‌జ‌ల్లాగా విజ్ఞ‌త ప్ర‌ద‌ర్శించారు. సిద్ధిపేట‌,క‌రీంన‌గ‌ర్‌ల‌లో నాడు డ‌బ్బుకు, అధికార బ‌లానికి ప‌ట్టం క‌ట్ట‌కుండా తెలంగాణ‌వాదానికి, దానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న కేసీఆర్‌కు ప‌ట్టం క‌ట్టారు. ఇప్పుడు హుజూరాబాద్ ఓట‌ర్లు కూడా ఎవ‌రెంత డ‌బ్బు ఇచ్చినా, ఎన్నివిందులు ఏర్పాటు చేసినా…ఓటువేసేట‌ప్పుడుమాత్రం ఈట‌ల రాజేంద‌ర్‌కు అన్యాయం జ‌రిగింద‌నేదే గుర్తు పెట్టుకున్నారు. ఈట‌ల మంచిత‌నం, ప్ర‌తి ఒక్క‌రిని ఆప్యాయంగా ప‌లుక‌రించే హంబుల్‌నెస్‌, స్థానికంగా ఆయ‌న ప్ర‌జ‌ల‌ను చూసుకునే త‌త్వమే ఆయ‌న్ను గెలిపించింది అంటున్నారు. బిజేపీ ఈట‌ల ఎన్నిక‌ల గుర్తుకు మాత్ర‌మే ప‌నికొచ్చింది త‌ప్ప గెలుపును నిర్ణ‌యించిన శ‌క్తి మాత్రం కాదు అన్న‌ది నిష్టూర స‌త్యం. కాక‌పోతే అధికార పార్టీ ఆగ‌డాల‌ను ఎదుర్కొనే మ‌నో ధైర్యం, స్థ‌యిర్యం మాత్రం బిజేపీలో ఉండ‌టం వ‌ల్లే ఈట‌ల‌కు సాధ్య‌మైంద‌న్న‌ది నిర్వివాదాంశం.
రెండోసారి తెలంగాణ‌లో అధికారం చేప‌ట్టాక కేసీఆర్ కుటుంబం చాలా ఆర‌గెంట్‌గా మారింద‌ని జ‌రుగుతున్న ప్ర‌చారం హుజూరాబాద్ ప్ర‌జ‌ల వ‌ర‌కు చేరింద‌ని, ఫ‌లితంగానే కారు గుర్తును ఓడించారంటున్నారు. నిరుద్యోగం ఎఫెక్టుతో యూత్ అంతా అధికార పార్టీకి వ్య‌తిరేకంగా ఏక‌మైన‌ట్లు అంటున్నారు.

నోట్ల క‌ట్ట‌లు, అధికార బ‌లం, మ్యానుపులేష‌న్ రాజ‌కీయాలు ఏవీ గెలిపించ‌లేవ‌ని హుజూరాబాద్ ఎన్నిక‌లు మ‌రోసారి నిరూపించాయి. దుబ్బాక‌, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి కేసీఆర్‌, కేటీఆర్‌లు వెళ్ల‌లేదు, ప్ర‌చారం చేయ‌లేదు. రెండు చోట్లా ఉప ఎన్నిక‌ల్లో హ‌రీష్‌రావునే ఇన్‌ఛార్జ్‌గా పెట్టారు. ఎందుకు? రెండు చోట్లా క‌నీసం ఒక్క ప్ర‌చార స‌భ‌లో కూడా వెళ్లి ప్ర‌చారం చేయ‌లేదు కేసీఆర్‌, కేటీఆర్‌లు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?