అప్పులే ఆధారం? ఇప్పటి వరకు నయాపైస రాలే
సర్కారు బండి నడవాలంటే అప్పులు తేవాల్సిందేనా? తప్పదు మరి తేవాల్సిందేనని బడ్జెట్ పద్దులు చూస్తే అర్థమవుతోంది. రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్ పద్దలో రూ. 69. 572.48 కోట్లు రిజర్వ్ బ్యాంకు వద్ద ఓపెన్ మార్కెట్ రుణాలతో పాటు ఇతర రుణాలు తీసుకు వస్తామని ప్రభుత్వం తన పద్దులో స్పష్టం చేసింది.

రూ.69,572.48 కోట్ల రుణం
పన్నులపై వచ్చే ఆదాయం రూ. 1. 38 లక్షల కోట్లు
పన్నుల్లో వాటా కేవలం రూ. 26.216 వేల కోట్లే
గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూ.21.636 కోట్ల అంచనా
విధాత: సర్కారు బండి నడవాలంటే అప్పులు తేవాల్సిందేనా? తప్పదు మరి తేవాల్సిందేనని బడ్జెట్ పద్దులు చూస్తే అర్థమవుతోంది. రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్ పద్దలో రూ. 69. 572.48 కోట్లు రిజర్వ్ బ్యాంకు వద్ద ఓపెన్ మార్కెట్ రుణాలతో పాటు ఇతర రుణాలు తీసుకు వస్తామని ప్రభుత్వం తన పద్దులో స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ. 12 వేల కోట్ల వరకు ఓపెన్ మార్కెట్ లో రుణం తీసుకు వచ్చారు. ద ఫ్రభుత్వం ప్రకటించే పథకాలకు రుణాలపైనే ఆధార పడుతున్నారని అర్థమవుతోందని ఆర్ధిక నిపుణులు చెపుతున్ను. ఈ ఏడాది ఓపినింగ్ బ్యాలెన్స్ రూ. 4886.57 కోట్ల మైనస్ తో మొదలైంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటికే తెలంగాణకు తీరని నష్టం చేసింది. ఎలాంటి అదనపు నిధులు కేటాయించలేదు. కేవలం పన్నుల్లో వాటాగా రూ. 26.216 .38 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద మరో రూ 21.636.15 కోట్ల నిధులు వస్తాయని అంచనా వేశారు. కానీ ఈ ఆర్థిక సవత్సరం ఏప్రిల్, మే నెలలకు సంబంధించి కాగ్ నివేదికలను పరిశీలిస్తే కేవలం రూ. 1800 కోట్ల పైచిలుకు పన్నుల్లో వాటా సొమ్ములు మినహాయిస్తే గ్రాంట్ ఇన్ ఎయిడ్ నయాపైస రాలేదు. కేంద్రం సహాయ నిరాకరణ నేపథ్యంలో రాష్ర్ప ప్రభుత్వం సొంత రాబడులపైనే ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వేసిన బడ్జెట్ అంచనాలను పరిశీలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో టాక్స్ రెవెన్యూ రూ.1,38,181.26 కోట్లుగా చూపించారు. ఇది నెలకు రూ.11 వేల కోట్ల పైచిలుకు మాత్రమే సొంత ఆదాయం ఉందని స్పష్టం చేస్తున్నది. పన్నేతర ఆదాయం భూముల అమ్మకాల ద్వారానే ఎక్కువ వస్తున్నది. దీనిపై రూ.35 వేల కోట్లు రాబడి వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. అయితే తెలంగాణ లో భూముల అమ్మకాలు నగరం చుట్టే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిలో రియల్ ఎస్టేట్ రంగం కుధేలైంది. రియల్ ఎస్టేట్ రంగాన్ని గాడిలో పెడితే తప్ప భూముల అమ్మకాల ద్వారా ఆదాయం వచ్చే మార్గం లేదని పరిశీలకులు చెపుతున్నారు. దీంతో పథకాలు, ఇతర కార్యక్రమాలకు అప్పులే ఆధారంగా కనిపిస్తోందన్న చర్చ పరిశీకుల్లో జరుగుతోంది.