Drumsticks | మునగకాయలతో రూ. 36 లక్షలు సంపాదిస్తున్న కుర్రాడు.. అదేలాగో తెలుసా..?
Drumsticks | మునగకాయకు( Drumsticks )మార్కెట్‌లో భలే డిమాండ్. మునగాకుకు( Moringa Leaf ) కూడా అదే స్థాయిలో డిమాండ్. ఇక మునగకాయతో కర్రీ( Curry ), సాంబార్( Sambar ) చేస్తారు. మునగకాయ కర్రీ, మునగకాయ సాంబార్‌ను ఇష్టంగా తింటారు. మరి అలాంటి మునగకాయలతో ఓ కుర్రాడు ఏడాదికి రూ. 36 లక్షలు సంపాదిస్తున్నాడు.

Drumsticks | ఇటీవలి కాలంలో చాలా మంది ఇంజినీర్లు( Engineers ).. వ్యవసాయం( Agriculture ) వైపు మొగ్గు చూపిస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీల్లో తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి.. పొలం బాట పడుతున్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉండే పంటల( Crops ) వైపు దృష్టి సారించి.. ఆ పంటలను పండించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని, సేంద్రీయ( Organic Farm ) పద్ధతుల్లో పంటలు పండించి ఊహించని లాభాలను గడిస్తున్నారు. ఓ ఇంజినీరింగ్ కుర్రాడు కూడా అమెరికన్ కంపెనీలో తన జాబ్‌ను వదిలేసి.. వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. మునగ చెట్లను( Moringa Trees ) పెంచి వాటి కాయలు( Drumsticks ), ఆకు( Moringa Leaf ), విత్తనాలతో ఏడాదికి రూ. 36 లక్షలు సంపాదిస్తున్నాడు. మరి ఆ ఇంజినీరింగ్ కుర్రాడి గురించి తెలుసుకోవాలంటే మహారాష్ట్ర( Maharashtra ) వెళ్లాల్సిందే.
మహారాష్ట్ర షోలాపూర్ జిల్లా( Solapur District )లోని కుర్దువాడి గ్రామానికి చెందిన సాగర్ ఖరే( Sagar Khare ).. 2016లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పుచ్చుకున్నాడు. ఆ తర్వాత అమెరికన్ కంపెనీ అడియంట్‌లో మంచి జీతంతో కూడిన ఉద్యోగం వరించింది. ఇక ప్రాజెక్టు ఇంజినీర్‌గా ఓ రెండేండ్ల పాటు పని చేశాడు. కానీ తన మనసు జన్మనిచ్చిన ఊరి వైపే మళ్లింది. తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. సొంతూరికి వచ్చేశాడు.
ఇక ఊరికైతే వచ్చాడు.. ఏం చేయాలి..?
ఇక ఊరికైతే వచ్చాడు.. ఏం చేయాలి..? అని ఆలోచిస్తున్నప్పుడు వ్యవసాయం( Agriculture ) చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పటికే తన తల్లిదండ్రులు చెరుకు( Sugarcane ), గోధుమ( Wheat ), పప్పు ధాన్యాల పంటలు పండిస్తున్నారు. అది సేంద్రీయ( Organic Farm ) పద్ధతిలో కాకుండా విరివిగా కెమికల్స్ ఉపయోగించి. దీంతో పెస్టిసైడ్స్‌కు భారీగా ఖర్చు అవ్వడంతో పాటు నేల తన సారవంతాన్ని కోల్పోతుంది. అంతేకాకుండా లాభాలు కూడా పెద్దగా రావడం లేదు. నష్టాల్లోనే కొట్టుమిట్టాడుతున్నారు. దీన్ని గమనించిన సాగర్.. సేంద్రీయ వ్యవసాయం వైపు దృష్టి సారించాడు.
మునగ వైపు సాగర్ దృష్టి..
సేంద్రీయ వ్యవసాయం వైపు దృష్టి సారించడమే కాకుండా.. మార్కెట్‌లో విరివిగా డిమాండ్ ఉండే పంటలను పండించాలని నిర్ణయించుకున్నాడు. వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకునే పంటలను వేయాలనుకున్నాడు. ఎందుకంటే షోలాపూర్‌లో సమ్మర్‌లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి కాబట్టి. ఇక మొత్తానికి మునగకాయ( Drumsticks ) తోట వేయాలని సాగర్ సిద్ధమయ్యాడు. మునగ పంట( Moringa Crop ) వేస్తే.. దాని కాయలతో పాటు ఆకు, విత్తనాలకు ఇండియాతో పాటు విదేశాల్లో భారీ డిమాండ్ ఉన్నట్లు సాగర్ గ్రహించాడు. ఈ క్రమంలో తమిళనాడు, మధ్యప్రదేశ్‌లోని మునగ రైతులతో సాగర్ సమావేశమై ఆ సాగుపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకున్నాడు.
వర్మీ కంపోస్టు, ఆవు పేడతో నేల సారవంతం
ఆ తర్వాత తన భూమిని సారవంతం చేశాడు. సాగు నీటి వనరులను సమకూర్చుకున్నాడు. వర్మీ కంపోస్టు స్వయంగా తయారు చేయడం ప్రారంభించాడు. ఇక వర్మీ కంపోస్టు( Vermi compost ), ఆవు పేడ( Cow Dung )తో నేలను సారవంతం చేశాడు. కార్బన్ కంటెంట్( Carbon Content ) కూడా ఆ నేలలో పెరిగింది.
2 కేజీల మునగ విత్తనాలతో ప్రారంభించి..
ఇక 2020లో ఓడీసీ3 రకానికి చెందిన మునగ విత్తనాలను 2 కేజీల వరకు తమిళనాడు( Tamil Nadu )లోని ఓ నర్సరీ నుంచి కొనుగోలు చేశాడు సాగర్. కేజీ మునగ విత్తనాలకు రూ. 4 వేలు ఖర్చు పెట్టాడు. ఎకరాకు అర కిలో విత్తనాలను నాటాడు. 2020 జూన్‌లో విత్తనాలను నాటగా.. 2021 ఫిబ్రవరిలో పంట చేతికొచ్చింది. మొత్తం నాలుగు ఎకరాల్లో 40 నుంచి 45 టన్నుల వరకు మునగకాయలను( Drumsticks ) పండించాడు. దీంతో రూ. 17 నుంచి రూ. 18 లక్షల వరకు సంపాదించాడు సాగర్.
ఏడాదికి రూ. 36 లక్షలు సంపాదిస్తున్నాడు..
ఇక ఒక ఎకరాలో మునగ ఆకును పండిస్తూ.. ఏడాదిలో నాలుగైదు సార్లు దాన్ని కోసి.. ఎండబెడుతారు. ఎండబెట్టిన ఆకులను పొడిగా చేసి.. కేజీ పౌడర్‌ను రూ. 500 నుంచి రూ. 600కు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. మునగాకు పౌడర్‌తో ఏడాదికి రూ. 12 లక్షలు సంపాదిస్తున్నాడు సాగర్. మునగకాయల నుంచి రూ. 17 లక్షలు, విత్తనాలు అమ్మి రూ. 7 లక్షలు ఆర్జిస్తున్నాడు. ఐదు ఎకరాల్లో మునగకాయ, ఆకు పండించి ఏడాదికి రూ. 36 లక్షలు సంపాదిస్తున్నాడు. మొత్తం ఖర్చులు పోను రూ. 30 లక్షల వరకు లాభం గడిస్తున్నాడు సాగర్.
అత్యధిక స్థాయిలో పోషకాలు..
మునగకాయను సాంబార్, కర్రీల్లో అధికంగా వినియోగిస్తారు. ఇక మునగ ఆకులను కూరగా కూడా వండుతారు. ఆకులను ఎండబెట్టి, దాని పౌడర్‌ను కూడా విక్రయిస్తారు. మునగకాయ, ఆకుల్లో అత్యధిక స్థాయిలో పోషకాలు ఉంటాయి. మెడిసిన్ తయారీలో కూడా వీటిని వినియోగిస్తారు. కాబట్టి మునగకాయ, ఆకుకు మార్కెట్‌లో భలే డిమాండ్ ఉంటుంది.