Moringa Farm | బంజరు భూమిలో బంగారం పండిస్తున్న రైతు.. ఏడాదికి రూ. 40 లక్షల టర్నోవర్..!
Moringa Farm | వ్యవసాయం( Agriculture ) దండగ అన్నవారికి ఈ అన్నదాత( Farmer ) ఓ ఆదర్శం. అదేదో అన్ని వనరులు ఉన్న సాధ్యం కానీ రైతులకు.. ఎలాంటి వనరులు లేని బంజరు భూమి( Barren Land )లో బంగారం పండిస్తున్నాడు. మునగ పంట సాగు( Moringa Farm )తో ఏడాదికి రూ. 40 లక్షలు సంపాదిస్తున్నాడు ఉమేశ్ రావు( Umesh Rao ).

Moringa Farm | కర్ణాటక( Karnataka )కు చెందిన ఉమేశ్ రావు( Umesh Rao ) తన చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. దీంతో కుటుంబాన్ని పోషించేందుకు పూర్వీకుల భూమిలో వ్యవసాయం( Agriculture ) చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక మొత్తం 8 ఎకరాల భూమిలో చెరుకు( Sugarcane ), మొక్కజొన్న, రాగితో పాటు కూరగాయలు( Vegetables ), ఇతర పంటలను పండించేవాడు.
2010లో కొత్తగా మునగ చెట్లను( Moringa Plants ) నాటాడు. మొత్తం 900 మొక్కలు నాటి.. ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. ఈ పంటను ఎందుకు ఎంచుకున్నాడంటే.. సాంబార్‌తో పాటు ఇతర వంటకాల్లో మునగకాయలను( Drumsticks ) నిత్యం వినియోగిస్తుంటారు కాబట్టి. అంతేకాకుండా మునగాకు పౌడర్‌కు కూడా మంచి డిమాండ్ ఉంది. ఇక 2020లో కరోనా సమయంలో ఈ పౌడర్‌కు మరింత డిమాండ్ రావడంతో.. మొత్తం 8 ఎకరాల్లో మునగ పంటను సాగు చేశాడు. ఆకుతో పాటు మునగకాయలను విక్రయించాడు.
పూర్వీకుల భూమిని వదిలిపెట్టి.. బంజరు భూమిలో అడుగుపెట్టి..
కానీ 2023 సమయంలో పూర్వీకుల భూమి( Ancestral Land ) విషయంలో వివాదాలు తలెత్తాయి. దీంతో ఆ భూమిని ఉమేశ్ వదిలిపెట్టాల్సి వచ్చింది. వ్యవసాయంలో బాగా అనుభవం సంపాదించిన ఉమేశ్.. మళ్లీ పొలం బాటనే పట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో కర్ణాటకలోని చిక్కబళ్లపూర్‌లోని గౌరిబీదనూరు గ్రామంలో బంజరు భూమిని( Barren Land ) పదేండ్లకు లీజుకు తీసుకున్నాడు. అది వ్యవసాయానికి పనికి రాని భూమి. కానీ ఉమేశ్ తనకున్న అనుభవంతో ఆ బంజరు భూమిలో కూడా మునగకాయల సాగు చేయాలనుకున్నాడు. మొదట రెండు ఎకరాల భూమిని సాగుకు అనుకూలంగా తయారు చేశాడు. దాంట్లో మునగ మొక్కలను నాటాడు. భూమిని సారవంతం చేసి.. ఆర్గానిక్ పద్ధతుల్లో వ్యవసాయం చేయడంతో మునగ మొక్కలు బాగా పెరిగాయి. అలా మొత్తం 10 ఎకరాల భూమిని సారవంతం చేసి.. మునగ సాగును ప్రారంభించాడు. ఓడీసీ-3 వెరైటీకి చెందిన మొక్కలను నాటాడు. ఈ మొక్కల నుంచి పంట దిగుబడికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది. మొత్తానికి మొదటి పంట ఆరు నెలల వరకు చేతికందింది.
పది ఎకరాల్లో రూ. 40 లక్షల టర్నోవర్
అలా ఎకరానికి 10 లక్షల టన్నుల వరకు మునగాకును, మునగకాయలను పండిస్తున్నాడు. వీటిని కేజీకి రూ. 140 చొప్పున విక్రయిస్తున్నాడు. డిమాండ్‌ను బట్టి కొన్ని సందర్భాల్లో కేజీ రూ. 500కు కూడా విక్రయిస్తున్నాడు. అలా మునగకాయలను, ఆకులను విక్రయిస్తూ.. ఎకరానికి రూ. 4 లక్షల ఆదాయం సంపాదిస్తూ.. ఏడాదికి 10 ఎకరాలకు రూ. 40 లక్షల టర్నోవర్‌కు ఎదిగాడు ఉమేశ్. ఇక ఎండబెట్టిన మునగాకును ఫార్మా కంపెనీలు, ఫర్టిలైజర్ కంపెనీలకు విక్రయిస్తున్నట్లు ఉమేశ్ తెలిపాడు.