Custard Apple Farming | సీతాఫలం సాగు.. ఎకరానికి రూ. 6 లక్షలు సంపాదిస్తున్న ఎంబీఏ గ్రాడ్యుయేట్
Custard Apple Farming | ఇటీవలి కాలంలో గ్రాడ్యుయేట్లు.. పొలం పనుల్లో బిజీగా గడుపుతున్నారు. భారీ వేతనాలతో కూడిన జీతాలను వదిలేసి.. వ్యవసాయం( Agriculture ) చేస్తున్నారు. ఓ ఎంబీఏ గ్రాడ్యుయేట్( MBA Graduate ) కూడా సీతాఫలం తోట సాగు( Custard Apple Farming )తో ఎకరానికి ఏడాదికి రూ. 6 లక్షలు సంపాదిస్తూ యువ రైతులకు( Young Farmers ) ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Custard Apple Farming | చదువుకుంటే జ్ఞానం వస్తుంది… బాగా కష్టపడితే ఉద్యోగం వస్తుంది.. ఇక నెలకు ఎంతో కొంతో జీతం వస్తుంది.. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జీవితం కొనసాగుతుంది. కానీ అనుకున్నంత డబ్బును మాత్రం సంపాదించలేం. అదే బిజినెస్( Business ) కానీ, వ్యవసాయం( Agriculture ) కానీ చేస్తే.. అనుకున్నంత డబ్బును సంపాదించొచ్చు. అది కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా ముందుకు సాగితేనే.
ఎంబీఏ( MBA ) చదివిన ఓ గ్రాడ్యుయేట్( Graduate )కు కూడా మంచి ఉద్యోగం వచ్చింది. జీతం కూడా బాగానే ఉంది. కానీ చేస్తున్న ఉద్యోగంలో, చేతికందుతున్న జీతంతో అతనికి సంతృప్తి లేదు. సొంతంగానే ఎదగాలి.. డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇంకేముంది.. తనకున్న మూడు ఎకరాల పొలంలో వ్యవసాయం చేయాలనుకున్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి పొలం బాట పట్టాడు. రెండు తరాల నుంచి ఒకే రకమైన సాగు చేస్తున్న చెరుకు పంటకు( Sugar Cane ) స్వస్తి పలికాడు. చెరుకు పంట నుంచి సీతాఫలం తోట సాగు( Custard Apple Farming ) వైపు దృష్టి సారించాడు. సీతాఫలం తోట సాగుతో ఎకరానికి ఏడాదికి రూ. 6 లక్షలు సంపాదిస్తూ యువ రైతులకు ఎంబీఏ గ్రాడ్యుయేట్( MBA Graduate ) ఆదర్శంగా నిలిచారు. మరి ఆ యువ రైతు.. అదేనండి ఎంబీఏ గ్రాడ్యుయేట్ గురించి తెలుసుకోవాలంటే మహారాష్ట్ర( Maharashtra )లోని పుణె జిల్లా( Pune District )లో వాలిపోవాల్సిందే.
శ్రీధర్ దైవేకర్( Shridhar Divekar ).. పుణె జిల్లాలోని దౌంద్ తాలుకా అతనిది. అగ్రికల్చర్( Agriculture )లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎంబీఏ మార్కెటింగ్ చేశాడు. ఉద్యోగం చేస్తున్నప్పటికీ అతని దృష్టి అంతా వ్యవసాయం వైపే ఉంది. ఈ క్రమంలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వచ్చే పంటలను పండించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తీవ్రంగా ఆలోచించిన తర్వాత సీతాఫలం పంట వేయాలనుకున్నాడు. ఇక ఎన్ఎంకే -01 గోల్డెన్ వైరెటీ విత్తనాలు(సీతాఫలం) అధిక దిగుబడిని ఇస్తాయని, ఫలం కూడా తీయ్యగా ఉంటుందని తెలుసుకున్నాడు. ఇక మార్కెట్‌లో కూడా సీతాఫలాలకు భారీ డిమాండ్ ఉంది. మరి ముఖ్యంగా ప్రాసెస్‌డ్ ఫుడ్ ఇండస్ట్రీ( Processed Food Industry )లో సీతాఫలంకు భారీ డిమాండ్ ఉంది. ఎందుకంటే సీతాఫలం గుజ్జును ఎక్కువగా ఐస్‌క్రీమ్స్( Ice Creams ), ఇతర ఆహార పదార్థాల్లో విరివిగా వినియోగిస్తున్నారు కాబట్టి.
2016లో సోలాపూర్‌లోని బర్సి నర్సరీకి వెళ్లాను. అక్కడ రూ. 75 చొప్పున 1148 మొక్కలను(సీతాఫలం) కొనుగోలు చేశాడు. ఇక తనకున్న మూడు ఎకరాల పొలంలో.. ఎకరాకు 350 నుంచి 400 మొక్కలు నాటాడు. ఒక్కో మొక్కకు 8 ఫీట్ల దూరం ఉండేలా, వరుసకు వరుసకు 14 ఫీట్ల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. జూన్ నెలలో మొక్కలు నాటాడు. అయితే భూమి యొక్క పీహెచ్‌ను 6.5 నుంచి 8.5 మధ్య ఉండేలా చర్యలు తీసుకున్నాడు. ఎందుకంటే పీహెచ్ ఈ మోతాదులో ఉంటేనే పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఫంగస్ కూడా దరి చేరదు. ఒక్కో మొక్క 20 నుంచి 30 కేజీల దిగుబడిని ఇస్తుంది.
మొక్కలు నాటిన నాలుగేండ్ల తర్వాత పంట చేతికి వచ్చింది. 2020లో తొలి పంటను చేతికి అందుకున్నాడు. ఆ సమయంలో ఒక్కో మొక్క కేవలం 4 కేజీల పండ్లను మాత్రమే ఇచ్చింది. ఏడాదికి ఏడాదికి ఆ దిగుబడి మరింత పెరిగింది. 2024లో ఒక్కో చెట్టు సగటున 22 కేజీల పండ్లను ఇచ్చింది. మొత్తం 1100 చెట్ల నుంచి భారీగా దిగుబడి వచ్చింది. కేజీ పండ్లను రూ. 80 చొప్పున విక్రయించాడు. అలా ఒక్కో ఏడాది ఎకరానికి రూ. 6 లక్షలు సంపాదిస్తూ మొత్తంగా రూ. 18 లక్షలు సంపాదించగలిగాడు. అదే చెరుకు పంటకు అయితే ఎకరానికి ఏడాదికి రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు మాత్రమే దిగుబడి వచ్చేది. అంటే సీతాఫలం సాగు ద్వారా ఆ ఆదాయం రెండింతలు అయింది. అయితే సీతాఫలం సాగులో ఖర్చులు పోను ఏడాదికి రూ. 14 లక్షలు ఆదాయం వస్తుందన్నాడు శ్రీధర్.