• Telugu News
  • /National

బెల్లం తినిపించిన ఆటో డ్రైవర్.. తొక్కి చంపేసిన ఏనుగు

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఊరేగింపులో ఉన్న ఏనుగుకు బెల్లం తినిపించేందుకు వెళ్లిన ఆటో డ్రైవర్‌పై ఏనుగు దాడి చేసింది. తొండంతో విసిరి కాలితో తొక్కడంతో చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jul 27, 2026, 4:29 pm IST
Read Time: 3 mins
బెల్లం తినిపించిన ఆటో డ్రైవర్.. తొక్కి చంపేసిన ఏనుగు

వన్యప్రాణులు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాయో ఒక్కోసారి నిపుణులకు కూడా అంచనాకు అందదు. తాజాగా ఓ పెంపుడు ఏనుగు వ్యవహరించిన తీరుతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఊరేగింపుగా వెళ్తున్న ఏనుగుకు ఆటో డ్రైవర్ విజయ్ బెల్లం తినిపించేందుకు ప్రయత్నించాడు. అనూహ్యంగా ఆ ఏనుగు తీవ్ర ఆగ్రహంతో అతడిపై దాడి చేసింది. తొండంతో ఎత్తి నేలకేసి కొట్టి, కాలితో తొక్కేసింది. దీంతో తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విజయ్ మరణించాడు. అనుకోని ఈ ఘటనతో ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలిచివేసింది.

ఎంత పెంపుడు జంతువుగా ఉన్నప్పటికి…మనుషులు ఏనుగులు వంటి వన్యప్రాణులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనడానికి ఈ ఘటనే నిదర్శనమని జంతు నిపుణులు హెచ్చరిస్తున్నారు.