విధాత:జగన్ అవినీతి స్థాయికి అద్దంపట్టేలా 15వేల కోట్ల బాక్సైట్ కుంభకోణం. విశాఖ మన్యంలో బాక్సైట్ గనుల దోపిడీకి ప్రభుత్వమే రహదారి నిర్మించింది. రికార్డు స్థాయిలో 24 రోజుల వ్యవధిలోనే రహదారి నిర్మించారు. భారీ వాహనాల రవాణా సులభతరం చేస్తూ 10 వేల చెట్లు నరికేశారు.
250 మంది జనాభా ఉండే ప్రాంతానికి రహదారి ఏర్పాటని చెబుతున్నారు. మారుమూల ప్రాంతానికి రహదారి అనడం అవినీతికి పరాకాష్ట అన్నారు నారా లోకేష్.