విధాత: రాష్ట్రంలో 102 కోట్ల రూపాయలతో 6 నైపుణ్య శిక్షణ కళాశాలల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియను రాష్ట్ర నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ(APSSDC) చేపట్టిందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయం, కాకినాడ జేఎన్‌టీయూ, కేఎల్ విశ్వవిద్యాలయం, కర్నూలు ట్రిపుల్ ఐటీలను ఎంపిక చేసినట్లు పేర్కొంది.