ఈ నెల 15 లోగా 9 లక్షల వ్యాక్సిన్ల రాక…అనిల్ కుమార్ సింఘాల్

• మిగిలితే…ఆర్టీసీ, బ్యాంకు ఉద్యోగులు, జర్నలిస్టులకు మొదటి డోసుగా వేస్తాం.• రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఈ నెల 15వ తేదీలోగా 9 లక్షల వ్యాక్సిన్ డోసులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రానున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక పీహెచ్సీ ఉన్న మండలంలో మరో పీహెచ్సీ, […]

  • Publish Date - May 4, 2021 / 02:56 PM IST

రెండో డోస్ గా 45 ఏళ్లకు పైబడి వారికి పంపిణీ

మిగిలితే…ఆర్టీసీ, బ్యాంకు ఉద్యోగులు, జర్నలిస్టులకు మొదటి డోసుగా వేస్తాం.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్
ఈ నెల 15వ తేదీలోగా 9 లక్షల వ్యాక్సిన్ డోసులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రానున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఒక పీహెచ్సీ ఉన్న మండలంలో మరో పీహెచ్సీ, ఎటువంటి వైద్య సేవలు లేని మండలాల్లో రెండు పీహెచ్సీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు ఇలా రాష్ట్రంలో కొత్తగా 176 కొత్త ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం రూ.346 కోట్లు వ్యయం కానుందన్నారు.

నూతనంగా నిర్మించబోయే హెల్త్ సెంటర్లలో వైద్యులు, నర్సులు సహా పలు 1400 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోస్టుల భర్తీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.165 కోట్ల భారం పడనుందన్నారు. రాష్ట్రంలో 166 మండలాల్లో ఒక పీహెచ్సీ మాత్రమే ఉందన్నారు. ఏజెన్సీ మండలాల్లో కూడా సీహెచ్సీల నిర్మాణం చేపడతామన్నారు.
1,15,784 టెస్టులు…20,034 పాజిటివ్ కేసులు…

గడిచిన 24 గంటల్లో 1,15,784 కరోనా టెస్టులు చేయగా, 20.034 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 82 మంది మృతి చెందారన్నారు. మంగళవారం మధ్యాహ్నం నాటికి 85 కొవిడ్ సెంటర్లలో ఈరోజు 12,412 మంది వైద్య సేవలు పొందుతున్నారన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో డిశ్ఛార్జిలు పెరిగాయన్నారు.

నేటి మధ్యాహ్నానానికి రాష్ట్ర వ్యాప్తంగా 6,319 ఐసీయు బెడ్లు ఉండగా, 5,743 వినియోగంలో ఉన్నాయన్నారు. కర్నూల్ లో 533 ఐసీయూ బెడ్లకు 300 బెడ్లపై కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్నారన్నారని, మరో 233 ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రకాశం జిల్లాలో 68 ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ బెడ్లు 21,858 ఉండగా, 20,108 బెడ్లు నేటి(మంగళవారం) మధ్యాహ్నానానికి నిండిపోయాయన్నారు 1,750 మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. అత్యధికంగా చిత్తూరులో 557 బెడ్ లు ఖాళీగా ఉండగా, విజయనగరం జిల్లాలో 200 అందుబాటులో ఉన్నాయన్నారు. మిగిలిన జిల్లాలో తక్కువ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయన్నారు.

రెమిడెసివిర్ కు కొరత లేదు…

రాష్ట్రంలో రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రుల్లో 21,898 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. నేటి(మంగళవారం) రాత్రికి మరో 12 వేల డోసులు రాబోతున్నాయని, వాటిని కూడా కూడా రేపు వివిధ ప్రభుత్వాసుపత్రులకు అందజేస్తామని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 14,030 రెమిడెసివిర్ ఇంజక్షన్లను ప్రైవేటు ఆసుపత్రులకు అందజేశామన్నారు. ప్ర్రైవేటు ఆసుపత్రుల్లో కూడా రెమిడిసివిర్ ఇంజక్షన్ల కొరత లేదన్నారు. కాల్ సెంటర్ కు కూడా కొరత ఉందంటూ ఫోన్లు రాలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 446 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను సప్లయ్ చేశామన్నారు. లిక్విడ్ ఆక్సిజన్ ట్రాన్స్ పోర్టు కోసం మరో 3 ట్యాంకర్లు అందుబాటులో రానున్నాయన్నారు.

104కు 16 వేలకు పైగా ఫోన్ కాల్స్…

104 కాల్ సెంటర్ కు గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 16,856 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. వాటిలో వివిధ రకాల సమాచారాల నిమిత్తం 6,592 కాల్స్, టెస్టులకు 3,726, అడ్మిషన్లకు 2, 976, కరోనా టెస్టు ఫలితం కోసం 2,224 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు.

ఆర్టీసీ, బ్యాంకు ఉద్యోగులకు, జర్నలిస్టులకు టీకా…

కేంద్ర ప్రభుత్వం నుంచి ఈనెల 15వ తేదీలోగా 9 లక్షల వ్యాక్సిన్లు వస్తాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఆ వ్యాక్సిన్లు 45 ఏళ్లు పైబడిన వారికి రెండో విడత డోసులకు మాత్రమే వేస్తామన్నారు. వారికి వేయగా మిగిలిన డోసులను ప్రజా సంబంధమైన కార్యకలాపాలతో ప్రత్యక్ష సంబంధం కలిగి… 45 ఏళ్లు నిండిన ఆర్టీసీ, బ్యాంకు ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు మొదటి డోసుగా వేస్తామన్నారు.

కర్ఫ్యూకు సహకరించండి…

కర్ఫ్యూలో భాగంగా బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ అన్ని సంస్థలు పనిచేస్తాయని ఆయన వెల్లడించారు. ఆ సమయంలో గుంపు గుంపులుగా ఉండకుండా 144 సెక్షన్ కు లోబడి అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉందన్నారు. మధ్యాహ్నం 12 గంటల తరవాత కర్ఫ్యూ అమల్లోకి వస్తుందన్నారు.

దీనికి సంబంధించిన పూర్తి స్థాయి మార్గదర్శకాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లుకు ఎస్పీలకు అందజేస్తామన్నారు. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి కర్ఫ్యూ తప్పనిసరి అ’ని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Latest News