విధాత:ఆంధ్రప్రదేశ్ కు ఎక్సిక్యూటివ్ రాజధానిగా ప్రభుత్వం తరలించాలని భావిస్తున్న విశాఖపట్టణంలోని 12 ఎమ్మార్వో కార్యాలయాల మీద ఏసీబీ అధికారులు నేడు ఒకేసారి దాడులు జరిపారు. వీటిమీద అవినీతి ఆరోపణలు వస్తుండటంతో ఏసీబీ అధికారులు ఒకేసారి దాడులు నిర్వహించి తనిఖీలు చేస్తున్నారు. ఆరోపణల నేపథ్యంలో లోతైన విచారణ జరిపేందుకు ఏసీబీ నడుం బిగించింది. ఈ దాడులు ఇంకా ఒకటి రెండు రోజులపాటు జరగవచ్చు.