పరామర్శించడానికి వస్తే అరెస్ట్ చేస్తారా..?
విధాత: రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ నేతలు నారా లోకేశ్, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, దూళిపాళ్ల నరేంద్రలను అరెస్ట్ చేయటం దుర్మార్గమన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యులు అచ్చెన్నాయుడు. వారు చేసిన తప్పేంటి ? ఎందుకు అరెస్ట్ చేశారు? హత్యకు గురైన దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించి వారికి న్యాయం చేయమని ప్రభుత్వాన్ని కోరటమే వారు చేసిన తప్పా?,పరామర్శకు వెళ్లిన టీడీపీ నేతలను 5 నిమిషాల్లో అరెస్ట్ చేశారు.. రమ్యను చంపిన నిందితుడిని […]

విధాత: రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ నేతలు నారా లోకేశ్, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, దూళిపాళ్ల నరేంద్రలను అరెస్ట్ చేయటం దుర్మార్గమన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యులు అచ్చెన్నాయుడు.
వారు చేసిన తప్పేంటి ? ఎందుకు అరెస్ట్ చేశారు? హత్యకు గురైన దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించి వారికి న్యాయం చేయమని ప్రభుత్వాన్ని కోరటమే వారు చేసిన తప్పా?,పరామర్శకు వెళ్లిన టీడీపీ నేతలను 5 నిమిషాల్లో అరెస్ట్ చేశారు.. రమ్యను చంపిన నిందితుడిని మాత్రం అర్దరాత్రి వరకు పట్టుకోలేకపోయారు.
మహిళలకు రక్షణ కల్పించడానికి ఉపయోగపడని పోలీసు వ్యవస్ద టీడీపీ నేతల్ని అరెస్ట్ చేయటంలో మాత్రం సమర్ధవంతంగా పనిచేస్తోంది.ముఖ్యమంత్రి బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోగా పరామర్శకు వెళ్లిన టీడీపీ నేతల్ని అరెస్ట్ చేయటం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి ఎందుకు బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు? రూ.10 లక్షలిచ్చి చేతులు దులుపుకుంటే రమ్య కుటుంబానికి న్యాయం జరుగుతుందా?గన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమయ్యాయి.