ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు 7కు వాయిదా

  • Publish Date - October 18, 2023 / 12:57 PM IST
  • 20న పీటి వారెంట్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం


విధాత : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను ఏపీ హైకోర్టు నవంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో బాబు క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్‌లో ఉన్నందునా ఏపీ హైకోర్టు ఐఆర్ కేసులో బెయిల్ విచారణను వాయిదా వేసింది.


అటు సీఐడీ పీటీ వారెంట్ విచరణపై హైకోర్టు ఇప్పటికే ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా నవంబర్ 7వరకు పొడగించింది. ఫైబర్ నెట్ కేసులో సీఐడీ దాఖలు చేసిన పిటీ వారెంట్ పై నిర్ణయాన్ని ఈనెల 20వ తేదీన వెల్లడిస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది. ఈ కేసులో బాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు 20వ తేదీన విచారిస్తామని ప్రకటించి నేపధ్యంలో ఏసీబీ కోర్టు కూడా తన నిర్ణయాన్ని అప్పటిదాకా వాయిదా వేసింది.