మ‌ధ్యంత‌ర బెయిల్‌పై హ‌ర్షాతిరేకాలు

మ‌ధ్యంత‌ర బెయిల్‌పై హ‌ర్షాతిరేకాలు
  • 53 రోజుల త‌ర్వాత నేటి సాయంత్రం రాజ‌మండ్రి
  • జైలు నుంచి బాబు బ‌య‌ట‌కువ‌చ్చే అవ‌కాశం


విధాత‌: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 53 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మ‌ధ్యంత‌ర బెయిల్ ల‌భించ‌డంతో టీడీపీ శ్రేణుల్లో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. మంగ‌ళ‌వారం రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప‌టాకులు కాల్చి ముఠాయిలు పంచి సంబురాలు జ‌రుపుకుంటున్నారు.


స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. వచ్చే నెల 24 వరకు మధ్యంతర బెయిల్ కొనసాగనుంది. అనారోగ్య కారణాలతో, కంటి చికిత్స కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. తీర్పు అనంత‌రం ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు రోడ్ల‌పైకి చేరుకున్నారు. టీడీపీ జెండాలు చేత‌ప‌ట్టుకొని నృత్యాలు చేసింది. పెద్ద ఎత్తున డీజే బాక్కులు పెట్టి డ్యాన్సులు చేశారు. జై బాబు జైజై బాబు అంటూ నినాదాలు చేశారు. పులిని ఎన్నో రోజులు బోనులో బంధించ‌లేద‌ని ఈ సంద‌ర్భంగా టీడీపీ నాయ‌కులు తెలిపారు.