వ్యవసాయ సలహా మండళ్లను బలోపేతం చేయాలి :మంత్రి కన్నబాబు

విధాత,అమరావతి : రాష్ట్రంలోని వ్యవసాయ సలహా మండళ్లను మరింత బలోపేతం చేయాలని అధికారులకు వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు ఆదేశించారు. ఎరువులు, విత్తనాల విషయంలో నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ధ్రువీకరించిన ఎరువులు, విత్తనాలను మాత్రమే రైతులకు అందాలన్నారు. విజిలెన్స్ తనిఖీలు క్రమం తప్పకుండా జరపాలని కన్నబాబు సూచించారు. రైతులకు అవగాహనా పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రాయోజిత, రాష్ట్ర పథకాలను పటిష్టంగా అమలు చేయాలని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.