Amaravati Capital : రాజధాని అమరావతి చట్టబద్ధతపై ఏపీ శాసనసభ తీర్మానం

అమరావతిని ఏపీ రాజధానిగా చట్టబద్ధం చేసే తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కేంద్రానికి పంపిన తర్వాత బిల్లుకు మార్గం సుగమం కానుంది.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Mar 28, 2026, 6:07 pm IST
Read Time: 3 mins
Amaravati Capital : రాజధాని అమరావతి చట్టబద్ధతపై ఏపీ శాసనసభ తీర్మానం

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దతపై ఏపీ శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. సీఎం చంద్రబాబునాయుడు ప్రవేశ పెట్టిన తీర్మానంపై సుదీర్ఘ చర్చ కొనసాగింది. తీర్మానంపై మాట్లాడిన టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు రాష్ట్ర విభజన జరిగిన తీరు..వైసీపీ మూడు రాజధానుల వ్యవహారాన్ని తప్పుబడుతూ మాట్లాడారు. చర్చ అనంతరం ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధత తీర్మానానికి సభ్యులు ఏకగ్రీవ ఆమోదం తెలిపారు.

శాసన సభ ఆమోదించిన ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాత్రికే నేరుగా కేంద్రానికి పంపనుంది. అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో కేంద్ర కేబినెట్‌ తీర్మానానికి రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో చట్టపరమైన ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. సీఆర్డీఏ-2014 తీర్మానాన్ని సవరించాలని ఏపీకి సూచించింది. ఈ సూచన మేరకు శనివారం శాసనసభలో ప్రత్యేక సమావేశం నిర్వహించి తీర్మానం చేశారు. రాష్ట్ర శాసన సభ ఆమోదించి పంపిన తీర్మానం మేరకు అమరావతి చట్ట సవరణ బిల్లును ఏప్రిల్ 1న కేంద్ర కేబినెట్ ఆమోదించనుంది. ఏప్రిల్ 2న పార్లమెంటులో కేంద్రం అమరావతి చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది. బిల్లు ఆమోదం తర్వాత అమరావతి ఏపీ రాజధానిగా కేంద్రం గెజిట్ విడుదల చేయనుంది.

ఇవి కూడా చదవండి :

ఆర్టీసీని మూసే కుట్ర చేసి..మాపై నిందలా ? : బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ఫైర్
తొలిముద్దతో చిన్నారులకు పోషకాహారం : సీఎంరేవంత్ రెడ్డి