Andhra Pradesh : ఏపీలో ఫ్రీ బస్సు స్కీమ్ పై ఆటో డ్రైవర్ల ఫైర్ !
ఏపీలో ఫ్రీ బస్ పథకం, ఆటో డ్రైవర్లు ఆందోళన..బస్సులో సీట్లు కష్టంగా, మహిళల ఆక్యుపెన్సీ పెరిగి వీడియో వైరల్.
అమరావతి : ఫ్రీ బస్సు పథకాలు తెలుగు రాష్ట్రాలలో రకరకాల కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి. ముందుగా తెలంగాణలో(Telangana) ఫ్రీ బస్ పథకాన్ని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్(Congress) ప్రభుత్వం తన ఎన్నికల హామీ మేరకు అమలులోకి తీసుకొచ్చింది. ఫ్రీ బస్(Free Bus) పథకంతో తమ జీవనోపాధి కోల్పోతున్నామంటూ ఆటో డ్రైవర్లు(Auto Drivers) ఆందోళనకు దిగారు. సుధీర్ఘ ఆందోళనలు చేసి అలసిపోయి చివరకు విరమించుకున్నారు. ఫ్రీ బస్ పథకంతో ఆర్టీసీ బస్సుల్లో(RTC Buses) మహిళల ఆక్యుపెన్సీ పెరిగిపోగా..మగవాళ్ల ప్రయాణం కష్టసాధ్యమైంది. చివరకు బస్సుల్లో సీట్ల కోసం మహిళలు సిగపట్లకు దిగడం సాధారణమైంది.
ఈ ప్రహసనమంతా ఇలా ఉండగానే.. ఏపీలో(Andhra Pradesh) టీడీపీ కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పథకం(Sthree Shakti Scheme) కింద ఆగస్టు 15నుంచి ఫ్రీ బస్ పథకాన్ని అమలులోకి తెచ్చింది. ఈ పథకం తమ పొట్టకొట్టేదిగా ఉందంటూ ఇప్పుడు ఏపీ ఆటో డ్రైవర్లు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఏలూరు జిల్లా పోలవరంలో ఆర్టీసీ బస్సులో భిక్షాటన చేసిన ఆటో డ్రైవర్లు ఫ్రీ బస్ కు వ్యతిరేకంగా తమ నిరసన తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఏపీలో సైతం తెలంగాణ తరహాలోనే ఫ్రీ బస్ పథకంలో మహిళల సిగపట్లు…ఆటో డ్రైవర్ల నిరసనలు కొనసాగుతుండటం గమనార్హం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram