విధాత:ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాన్ని ఇరు ప్రభుత్వాలు చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. తెలుగు ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం వద్దని కేసీఆర్‌కు మనవి చేశారు. నిజానికి రాయలసీమ ప్రజలకు నీళ్లు ఇచ్చి ఆదుకోవాలన్న తపన కేసీఆర్‌కు కూడా ఉందన్నారు. జగన్, కేసీఆర్‌కు ఒకరంటే ఒకరికి ఎనలేని అభిమానమని నారాయణస్వామి పేర్కొన్నారు.