జస్వంత్ రెడ్డి మృతి పట్ల గవర్నర్ విచారం

విజయవాడ,విధాత‌: జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లా, సుందర్‌బని సెక్టార్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ జవాన్ఎం. జస్వంత్ రెడ్డి వీర మరణం చెందటం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ జస్వంత్ రెడ్డి 2016లో మద్రాస్ రెజిమెంట్‌లో చేరారు, భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో అసువులు బాసారు. భారత మాత కోసం అమరుడైన జస్వంత్ […]

జస్వంత్ రెడ్డి మృతి పట్ల గవర్నర్ విచారం

విజయవాడ,విధాత‌: జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లా, సుందర్‌బని సెక్టార్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ జవాన్ఎం. జస్వంత్ రెడ్డి వీర మరణం చెందటం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ జస్వంత్ రెడ్డి 2016లో మద్రాస్ రెజిమెంట్‌లో చేరారు, భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో అసువులు బాసారు. భారత మాత కోసం అమరుడైన జస్వంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు గవర్నర్ తన హృదయ పూర్వక సంతాపం తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.