టిడ్కో తీసుకోనున్న రూ.5,990 కోట్ల బ్యాంకు రుణానికి ఏపీ ప్రభుత్వం హామీ

అమరావతి,విధాత‌: ఇళ్ల కోసం టిడ్కో తీసుకోనున్న రూ.5,990 కోట్ల బ్యాంకు రుణానికి ఏపీ ప్రభుత్వం హామీని ఇవ్వనుంది. ఈ మేరకు బ్యాంకు రుణానికి హామీనిచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. పీఎం ఆవాస్‌ యోజన, జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు రుణం తీసుకోనుంది. 2.16 లక్షల ఇళ్లు, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి టిడ్కో రుణం తీసుకోనుంది. ఈ మొత్తాన్ని ఏడాదిలోగా వాడుకోవాలని టిడ్కోకు ప్రభుత్వం సూచించింది. రుణం తీసుకున్న కాలానికి ప్రభుత్వం హామీ ఉంటుందని స్పష్టం చేసింది.

  • Publish Date - July 7, 2021 / 03:52 AM IST