విధాత: నకిలీ చలానాల వ్యవహారానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో నకిలీ చలానాల వ్యవహారంతో మిగతా శాఖల్లోనూ ప్రభుత్వం తనిఖీలు.చలానాల ద్వారా చెల్లించే నగదు సీఎఫ్ఎంఎస్‌కు జమ అవుతుందా లేదా అన్న అంశంపై విచారణ.ప్రజలు చెల్లించే చలానాల నగదు జమ కావడంలో జాప్యం వల్లే అక్రమాలకు ఆస్కారం.ఇప్పటివరకు 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ₹8.13 కోట్ల మేర అవకతవకలు. ₹4.62 కోట్ల మేర రికవరీ, 14 మంది సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.