విధాత : టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్. చంద్రబాబునాయుడుకు హైకోర్టులో చుక్కెదురైంది. అంగళ్లు అల్లర్ల కేసు, అమరావతి రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసులో దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఆయా కేసుల్లో చంద్రబాబు తరుపునా సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ లూధ్రా, సీఐడీ తరుపున ఏజీ శ్రీరామ్ తన వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. సోమవారం చంద్రబాబు బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌తో పాటు, సీఐడీ కస్టడి పిటిషన్‌లను కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. అటు ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పెండింగ్‌లో ఉన్న బాబు పీటీ వారెంట్లపై విచారణ సాగింది. బాబు తరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించగా, సీఐడీ తరపు న్యాయవాదులు మాత్రం వాదనలు అవసరం లేదని, కోర్టు నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు.
సుప్రీంలో క్వాష్ పిటిషన్ విచారణ నేటికి వాయిదా
ఇక సుప్రీంకోర్టులో స్కిల్ డెలవప్ మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై సోమవారం విచారణ సాగింది. బేలా త్రివేది.. చంద్రబాబు తరపునా సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే తన వాదనలు వినిపించారు. 17ఏ చుట్టునే ప్రధానంగా వాదనలు కొనసాగాయి. రాజకీయ కారణాలతోనే కేసు పెట్టారని, ఈ కేసులో గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదని వాదించారు.
అయితే జడ్జీ బేలా త్రివేది స్పందిస్తూ 17ఏలో చాల అంశాలున్నానయని, 17ఏకు ముందు జరిగిన నేరాలకు వర్తిస్తుందో లేదో చూడాలన్నారు. 17ఏ అవినీతి నిరోధానికి మాత్రమేగాని, నిందితులను కాపాడేందుకు కాదని, ఇదే ఈ చట్టం అసలు ఉద్దేశం కదా అన్నారు. 17ఏ మేరకు అనుమతి తీసుకోకపోతే జరిగిన దర్యాప్తు ఏం కావాలంటూ వ్యాఖ్యానించారు. రేపు సీఐడీ తరుపునా ముకుల్ రోహిత్గి తన వాదనలు వినిపించనున్నారు.