స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రుణాల‌పై హైకోర్టులో విచారణ

విధాత‌: స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. విశాఖ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. రిజర్వ్ బ్యాంక్, కాగ్, మరో ఐదు బ్యాంక్‌లను ఇంప్లీడ్ చేయాలని పిటిషనర్లు అభ్యర్థించారు. కావాలని జాప్యం చేసేందుకే పిటిషనర్లు ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదన వినిపించారు. బ్యాంకులు, కాగ్, కేంద్రాన్ని పార్టీలుగా చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని […]

  • Publish Date - September 8, 2021 / 06:49 AM IST

విధాత‌: స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. విశాఖ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. రిజర్వ్ బ్యాంక్, కాగ్, మరో ఐదు బ్యాంక్‌లను ఇంప్లీడ్ చేయాలని పిటిషనర్లు అభ్యర్థించారు. కావాలని జాప్యం చేసేందుకే పిటిషనర్లు ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదన వినిపించారు. బ్యాంకులు, కాగ్, కేంద్రాన్ని పార్టీలుగా చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని దుష్యంత్ దవే తెలిపారు. కౌంటర్ వేసేందుకు ప్రభుత్వ తరపు న్యాయవాది నాలుగు వారాల గడువు కోరారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.