ఏపీ శాసన పరిషత్తులో ఎంఎల్ఏ కోటాకింద 3 ఎంఎల్సి స్థానాల భర్తీకి నోటిఫికేషన్ జారీ
విధాత:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన పరిషత్తులో ఖాళీగా ఉన్న,శాసన సభ సభ్యులచే ఎన్నుకోవాల్సిన ముగ్గురు శాసన మండలి సభ్యులు(MLC)ఎన్నిక నిమిత్తం మంగళవారం అసెంబ్లీ భవనంలో రిటర్నింగ్ అధికారి రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పివి సుబ్బారెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు.శాసన మండలి సభ్యులు మెహమ్మద్ అహ్మద్ షరీఫ్ (శాసన మండలి మాజీ అధ్యక్షులు),చిన్న గోవింద రెడ్డి దేవసాని,సోము వీర్రాజుల పదవీ కాలం గత మేనెల 31వ తేదీతో పూర్తి కావడంతో ఈఖాళీలను భర్తీ చేసేందుకు ఈమేరకు రిటర్నింగ్ […]

విధాత:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన పరిషత్తులో ఖాళీగా ఉన్న,శాసన సభ సభ్యులచే ఎన్నుకోవాల్సిన ముగ్గురు శాసన మండలి సభ్యులు(MLC)ఎన్నిక నిమిత్తం మంగళవారం అసెంబ్లీ భవనంలో రిటర్నింగ్ అధికారి రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పివి సుబ్బారెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు.శాసన మండలి సభ్యులు మెహమ్మద్ అహ్మద్ షరీఫ్ (శాసన మండలి మాజీ అధ్యక్షులు),చిన్న గోవింద రెడ్డి దేవసాని,సోము వీర్రాజుల పదవీ కాలం గత మేనెల 31వ తేదీతో పూర్తి కావడంతో ఈఖాళీలను భర్తీ చేసేందుకు ఈమేరకు రిటర్నింగ్ అధికారి నోటిఫికేషన్ జారీ చేశారు.
ఈనోటిఫికేషన్ ప్రకారం ఈనెల 16వతేదీ మధ్యాహ్నం 3గం.ల వరకూ అసెంబ్లీ భవనంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు.ప్రభుత్వ సెలవు రోజులు మినహా మిగతా అన్నిరోజుల్లో ప్రతి రోజు ఉ.11గం.ల నుండి మధ్యాహ్నం 3గం.ల వరకూ నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.నామినేషన్ పత్రాలను తన కార్యాలయం నుండి పైన పేర్కొన్న సమయాల్లో అన్నిపని వేళళ్లో పొందవచ్చని తెలిపారు.
నామినేషన్ పత్రాలను అభ్యర్ధిగాని లేదా వారి ప్రతిపాదకుడు గాని రిటర్నింగ్ అధికారి, రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శికి గాని లేక సహాయ రిటర్నింగ్ అధికారి మరియు శాసన మండలి ఉప కార్యదర్శికి గాని 2021 నవంబరు 16వతేదీ దాటకుండా (సెలవు రోజులు మినహా)ఏరోజైనా ఉ.11గం.ల నుండి మధ్యాహ్నం 3గం.ల మధ్య నామినేషన్ ధాఖలు చేయయవచ్చని రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి తెలియజేశారు.
అలాగే నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్ధి ఎవరైనా వారి నామినేషన్ ను ఉప సంహరించుకోదలిస్తే ఉప సంహరణ నోటీసును,అభ్యర్ధి లేదా ప్రతిపాదకుడు లేదా వ్రాతపూర్వకంగా అందజేయుటకు అధికారం పొందిన వారి ఎన్నిక ఏజెంటుగాని,పైన పేర్కొన్నఅధికారుల్లో ఏఒక్కరికైనా ఈనెల 22వతేదీ మధ్యాహ్నం 3గం.లలోగా అందజేయవచ్చని రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి తెలియజేశారు.