విధాత:రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పాతురి నాగభూషణం, సత్యమూర్తి, వీహెచ్‌పీ నేతలు మంగళవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా వినాయక చవితి వేడుకలకు ప్రభుత్వం అనుమతి నిరాకరణపై గవర్నర్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా చవితి పందిర్లకు అనుమతులు ఇప్పించాలని గవర్నర్‌ను నేతలు కోరారు.