రేపు కర్నూలు లో భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుల సమావేశం

విధాత‌:మొన్న కర్నూలులో జరగాల్సిన సమావేశం పూర్వపు అధ్యక్షులు చిలకం మరణంతో వాయిదా వేయడం జరిగిందని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ స‌మావేశానికి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీఎంపీలు ఇతర రాష్ట్ర ముఖ్యనాయకులు పాల్గొననున్నార‌ని ఆయ‌న తెలిపారు. ముఖ్యమంత్రులు ఇద్దరు రాజకీయ ప్రయోజనాలు చూస్తున్నారు,రాష్ట్రంలో నెలకొన్న జలవివాదాలు, రాయలసీమ సాగునీరు ఇతర సమస్యలపై చర్చ .తెలంగాణ ఏకపక్ష నిర్ణయంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రాంతంలో ని రైతులకు సమస్యలు […]

  • Publish Date - July 8, 2021 / 06:59 AM IST

విధాత‌:మొన్న కర్నూలులో జరగాల్సిన సమావేశం పూర్వపు అధ్యక్షులు చిలకం మరణంతో వాయిదా వేయడం జరిగిందని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ స‌మావేశానికి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీఎంపీలు ఇతర రాష్ట్ర ముఖ్యనాయకులు పాల్గొననున్నార‌ని ఆయ‌న తెలిపారు.

ముఖ్యమంత్రులు ఇద్దరు రాజకీయ ప్రయోజనాలు చూస్తున్నారు,రాష్ట్రంలో నెలకొన్న జలవివాదాలు, రాయలసీమ సాగునీరు ఇతర సమస్యలపై చర్చ .తెలంగాణ ఏకపక్ష నిర్ణయంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రాంతంలో ని రైతులకు సమస్యలు , పోతిరెడ్డిపోడు కాలువలకు నీటి నిల్వలో అంతరాయం, ఆయకట్టు ప్రాంతాల సాగుకు నీరందడంతో ప్రతికూల పరిస్థితులలో రైతులు ఉన్నారు .రాష్ట్రాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తపరిస్థితులు, రాయలసీమ అభివృద్ధి చర్చ, పై ప్రధాన అజెండా గా చర్చించడం జరుగుతుంది .రాష్ట్ర రైతుల ప్రయెూజనాల విషయంలో ఏపి బీజీపి పోరాడుతుందన్నారు.