Cachidi Fish
విధాత: పలు ఔషధ గుణాలు కల్గిన 25కిలోల కాచిడీ చేప ఏపిలోని కాకినాడ కుంభాభిషేకం రేవు సమీపంలో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకార్మికులకు చిక్కింది. దీనిని స్థానిక చేపల వ్యాపారి రూ.3.10లక్షలు ధరకు కొనుగోలు చేయడం విశేషం.
కాచిడీ చేపలో ఉండే బ్లాడర్‌కు ఎక్కువ డిమాండ్ ఉంటుందని, పిత్తాశయం, ఊపిరితిత్తుల మందుల తయారీలో ఎక్కువ వినియోగిస్తారని వైద్యులు తెలిపారు.