YS Jagan | జగన్ విదేశీ పర్యటనకు అనుమతినివ్వద్దు.. కోర్టును కోరిన సీబీఐ

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌ బ్రిటన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న జగన్‌కు విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది

Reported by: Somu | ఆంధ్ర ప్రదేశ్ | Aug 21, 2024, 4:07 pm IST
Read Time: 2 mins
YS Jagan | జగన్ విదేశీ పర్యటనకు అనుమతినివ్వద్దు.. కోర్టును కోరిన సీబీఐ

YS Jagan | ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌ బ్రిటన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న పిటిషన్‌పై సీబీఐ (CBI) కోర్టులో విచారణ జరిగింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న జగన్‌కు విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది. జగన్ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు ముగిసిపోగా కోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల 27కు వాయిదా వేసింది.

యూకేలో చదువుతున్న కుమార్తె వద్దకు సెప్టెంబరు మొదటి వారంలో వెళ్లడానికి అనుమతించాలని పిటిషన్‌లో జగన్ కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.రఘురాం సీబీఐ వివరణ కోరుతూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు. దీంతో సీబీఐ నేడు వాదనలు వినిపిస్తూ జగన్ బ్రిటన్ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును కోరింది. తదుపరి విచారణ 27కువాయిదా వేయగా ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది