వైస్సార్సీపీ లో పదవుల సంబరాలు

విధాత,అమరావతి: వైసీపీ అధికార పగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయ్యాక కార్పొరేషన్‌ పదవుల పందేరంపై సీఎం జగన్మోహన్‌రెడ్డి దృష్టి సారించారు. నేడో రేపో ఈ నామినేటెడ్‌ పదవుల జాబితాను వెల్లడించనున్నారు. ప్రాంతాలు, కులాలవారీగా ఎంపీలు విజయసాయిరెడ్డి,మోపిదేవి వెంకటరమణారావు,వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులతో జగన్‌ కసరత్తు చేశారు. ఇందులో 50 శాతం మహిళలు, వెనుకబడినవర్గాలు, ఎస్సీఎస్టీ, మైనారిటీలకు కట్టబెడతారు. ఈ జాబితాను అధికారికంగా ప్రకటించేంత వరకూ పేర్లు బయటకు […]

వైస్సార్సీపీ లో పదవుల సంబరాలు

విధాత,అమరావతి: వైసీపీ అధికార పగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయ్యాక కార్పొరేషన్‌ పదవుల పందేరంపై సీఎం జగన్మోహన్‌రెడ్డి దృష్టి సారించారు. నేడో రేపో ఈ నామినేటెడ్‌ పదవుల జాబితాను వెల్లడించనున్నారు. ప్రాంతాలు, కులాలవారీగా ఎంపీలు విజయసాయిరెడ్డి,మోపిదేవి వెంకటరమణారావు,వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులతో జగన్‌ కసరత్తు చేశారు. ఇందులో 50 శాతం మహిళలు, వెనుకబడినవర్గాలు, ఎస్సీఎస్టీ, మైనారిటీలకు కట్టబెడతారు. ఈ జాబితాను అధికారికంగా ప్రకటించేంత వరకూ పేర్లు బయటకు పొక్కనివ్వొద్దని నేతలను సీఎం హెచ్చరించారు.తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో కార్పొరేషన్‌ పదవులను బుధవారం ప్రకటిస్తామని సజ్జల మంగళవారమే చెప్పినప్పటికీ వెల్లడించలేదు.మరోవైపు ఆశావహుల్లో సందడి పెరిగింది. జిల్లాలవారీగా ఆరాలు మొదలయ్యాయి.