వైసీపీ నేతల అవినీతి, అక్రమాలను అడ్డుకుంటే దాడులు చేస్తారా?
వైసీపీ ప్రజా ప్రతినిధులు ప్రజాసంపదను దోచుకుంటున్నారు
క్రిష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం జి. కొండూరు మండలం గడ్డ మణుగ గ్రామం పారెస్ట్ లో వైసీపీ నేతల అక్రమ మైనింగ్ ని వెలికితీసేందుకు వెళ్లిన దేవినేని ఉమామహేశ్వరరావు కారుపై వైసీపీ గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు చంద్రబాబు. మీ అవినీతి,అక్రమాలను అడ్డుకుంటే దాడులకు పాల్పడతారా? వైసీపీ నేతలు ప్రజా సంపదను దోచుకుంటుంటే ప్రజల తరపున తెలుగుదేశం నేతలు అడ్డుకోవడం తప్పా?. మీ అవినీతిని అడ్డుకుంటే దాడులు, మైనింగ్ ని అడ్డుకుంటే హత్యయత్నాలు,బెదిరింపులకు పాల్పడుతారా? ఒక్కరిపై 100 మంది వైసీపీ గూండాల దాడి పిరికిపింద చర్య, స్ధానిక ఎమ్మెల్యే వసంత క్రష్ణప్రసాద్ ప్రోథ్బలంతోనే ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో నిందితులపై హత్యయత్నం కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి.
జగన్ రెడ్డి చేతకానిపాలనతో భవిష్యత్ లో మళ్లీ వైసీపీ అదికారంలోకి రాదని వైసీపీ నేతలు, కార్యకర్తలకు స్పష్టంగా అర్ధమైంది. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నట్టు అధికారం ఉండగానే అందినకాడికి దోచుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు చెరువులు, గుట్టలు, చివరకు శ్మశానాలకు కూడా వదలకుండా దోచుకుంటున్నారు. ప్రజా సందపను కాపాడాల్సిన ప్రజా ప్రతినిధులే ప్రజలను సంపదను దోచేస్తున్నారు.
అదికార మదంతో రాష్ట్రంలో వైసీపీ నేతల అవినీతి, అరాచాకాలు పెరిగిపోయాయి. ముందురోజుల్లో వైసీపీ నేతలు చేసిన అవినీతికి, అరాచకాలకు చక్ర వడ్డీతో సహా మూల్యం చెల్లించకతప్పదు.