విధాత : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణపై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. మంగళవారం చంద్రబాబు న్యాయవాది హరీశ్ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరుపున ముకుల్ రోహత్గి సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు హోరాహోరిగా తమ వాదనలు వినిపించారు.
ముఖ్యంగా 17ఏ వర్తింపుపై ఇరువురు తమ వాదనలు బలంగా వినిపించారు. మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు తరపు న్యాయవాదులు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు లంచ్ మోషన్ అభ్యర్థనను నిరాకరించి బుధవారం వాదనలు వింటామని తెలిపింది. ఏసీబీ కోర్టు జడ్జీ సెలవులో ఉండటంతో చంద్రబాబుపై దాఖలైన పీటీ వారెంట్ పిటిషన్లపై రేపు విచారణ జరిగే అవకాశముంది.