విధాత:అప్పులకు గ్యారంటీ అవసరం లేదనడం దుర్మార్గం.బడ్జెట్ అప్పులకు కేంద్రం అనుమతి పొందాల్సిందే రాష్ట్రాన్ని జగన్ రెడ్డి ఆర్ధికంగా దివాళా తీశారన్నారు యనమల రామకృష్ణుడు.బడ్జెట్ అప్పులకు ఆర్టికల్ 293(3) క్రింద కేంద్ర అనుమతి తప్పనిసరి.ఏ కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకున్నా గ్యారంటీ ఇవ్వాల్సిందే
మార్కెట్ లోన్స్ కంటే ఆఫ్ బడ్జెట్ లోన్స్ ఎక్కువగా తీసుకున్నారు,గ్యారంటీ అవసరం లేదన్న ప్రభుత్వం ఎస్క్రో ఒప్పందం ఎందుకు చేసుకున్నట్లు.? కార్పొరేషన్ రుణాలను ఎలా రికవరీ చేస్తారు.?సంక్షేమం కోసం చేసిన ఖర్చుతో ఆర్ధిక అభివృద్ధి ఎలా సాధ్యం.?పేదల్ని ఇంకా పేదలుగా.. ధనికుల్ని మరింత ధనికులుగా చేస్తున్నారు.పేదల సంక్షేమాన్ని చూపి.. వారి నెత్తిన అప్పు భారం పెంచుతోందిఆదాయ మార్గాలుపెంచకుండా అప్పులతో పాలన ఎన్నాళ్లు.?.ఇష్టానుసారంగా చేసే ఖర్చులతో ఆర్ధిక సంక్షోభాన్ని సృష్టించారు. జగన్ రెడ్డి అసమర్ధ పాలనతో రాష్ట్రం ఆర్ధిక దివాళా దిశగా అడుగులు వేస్తోందన్నారు.