విధాత:ఆంధ్రా సీఎం వైఎస్ జగన్ అనంతపురం,కడప రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం బద్వేలు, కడప నియోజకవర్గాల్లో పర్యటించారు. రెండు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.ఈ క్రమంలోనే రాజారెడ్డి మైదానాన్ని సందర్శిచి అక్కడ స్టేడియం అభివృద్ధి పనులకు ఫ్లడ్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు.అక్కడ కాసేపు క్రికెట్ ఆడి అందరిని అలరించారు.