సీఎం జగన్ పోలవరం పర్యటన వాయిదా

విధాత‌:ఏపీ సీఎం జగన్ రేపు పోలవరం ప్రాజెక్టు సందర్శించాలని భావించగా, అనుకోని రీతిలో ఆయన పర్యటన వాయిదా పడింది. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు జరిగిన నేపథ్యంలో, ఒక్కరోజు ముందుగా ఆయన పర్యటన వాయిదా పడినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ఈ నెల 14న సీఎం జగన్ పోలవరం పర్యటనకు వెళ్లబోవడంలేదని తెలిపింది. ఈ మేరకు ఉన్నతాధికారులకు సీఎం కార్యాలయం నుంచి సమాచారం అందింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పోలవరం […]

  • Publish Date - July 13, 2021 / 09:59 AM IST

విధాత‌:ఏపీ సీఎం జగన్ రేపు పోలవరం ప్రాజెక్టు సందర్శించాలని భావించగా, అనుకోని రీతిలో ఆయన పర్యటన వాయిదా పడింది. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు జరిగిన నేపథ్యంలో, ఒక్కరోజు ముందుగా ఆయన పర్యటన వాయిదా పడినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ఈ నెల 14న సీఎం జగన్ పోలవరం పర్యటనకు వెళ్లబోవడంలేదని తెలిపింది. ఈ మేరకు ఉన్నతాధికారులకు సీఎం కార్యాలయం నుంచి సమాచారం అందింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తిచేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అందుకే రేపు పోలవరం సందర్శించి, పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఆయన పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో, తిరిగి ఎప్పుడు పోలవరం వెళ్లాలనేది తదుపరి నిర్ణయించనున్నారు.