కానిస్టేబుల్ వీడియో…పోలీసు అధికారులు చెలగాటం
తాడిపత్రిలో కానిస్టేబుల్ ప్రాణాలతో పోలీసు అధికారులు చెలగాటమాడుతున్నారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నా విధులకు హాజరుకావాలంటూ ఆదేశాలిచ్చారు. ఈ నెల 20న కరోనా పరీక్షలు చేయించుకున్న కానిస్టేబుల్ గణేష్‌కు ఎస్ఐ ఖాజాహుస్సేన్ కోర్టు డ్యూటీ వేశారు. అయితే ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. ప్రాణాపాయస్థితిలో ఉన్న కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించారు. తాను కోవిడ్ బారిన పడినా ఎస్‌ఐ ఖాజా హుస్సేన్ ట్రాఫిక్ డ్యూటీ వేసి వేధించారంటూ గణేష్ అంబులెన్స్‌లో నుంచి సెల్ఫీ […]

తాడిపత్రిలో కానిస్టేబుల్ ప్రాణాలతో పోలీసు అధికారులు చెలగాటమాడుతున్నారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నా విధులకు హాజరుకావాలంటూ ఆదేశాలిచ్చారు. ఈ నెల 20న కరోనా పరీక్షలు చేయించుకున్న కానిస్టేబుల్ గణేష్‌కు ఎస్ఐ ఖాజాహుస్సేన్ కోర్టు డ్యూటీ వేశారు. అయితే ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. ప్రాణాపాయస్థితిలో ఉన్న కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించారు. తాను కోవిడ్ బారిన పడినా ఎస్‌ఐ ఖాజా హుస్సేన్ ట్రాఫిక్ డ్యూటీ వేసి వేధించారంటూ గణేష్ అంబులెన్స్‌లో నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలను ఎస్ఐలు పట్టించుకోవడం లేదని, ఒకవేళ తాను చనిపోతే.. తన చావుకు ఎస్ఐ ఖాజా హుస్సేన్ కారణమంటూ కానిస్టేబుల్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.