ఆర్టీసీ ఆన్లైన్ టికెట్ మెసేజ్‌లో డ్రైవర్ ఫోన్ నంబరు వద్దని ఆదేశాలు
విధాత: ఆర్టీసీలో దూరప్రాంత సర్వీసులకు ఆన్లైన్ రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకునే వారికి ప్రయాణ అప్రమత్తత (జర్నీ అలెర్ట్)పై సెల్‌ఫోన్‌కు పంపే ఎస్ఎంఎస్లో ఇకపై డ్రైవర్ ఫోన్‌నంబరు ఇవ్వకూడదని యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. డ్రైవరు, ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆర్టీసీ సెంట్రల్ కంప్లైంట్ సెల్ హెల్ప్‌లైన్ నంబరు 08662570005 మాత్రమే ఇవ్వాలని ఆపరేషన్స్ ఈడీ అన్ని జోన్ల ఈడీలకు ఆదేశాలిచ్చారు. ఈ అంశంపై తాము చేసిన విజ్ఞప్తికి యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన […]

విధాత: ఆర్టీసీలో దూరప్రాంత సర్వీసులకు ఆన్లైన్ రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకునే వారికి ప్రయాణ అప్రమత్తత (జర్నీ అలెర్ట్)పై సెల్‌ఫోన్‌కు పంపే ఎస్ఎంఎస్లో ఇకపై డ్రైవర్ ఫోన్‌నంబరు ఇవ్వకూడదని యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. డ్రైవరు, ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆర్టీసీ సెంట్రల్ కంప్లైంట్ సెల్ హెల్ప్‌లైన్ నంబరు 08662570005 మాత్రమే ఇవ్వాలని ఆపరేషన్స్ ఈడీ అన్ని జోన్ల ఈడీలకు ఆదేశాలిచ్చారు. ఈ అంశంపై తాము చేసిన విజ్ఞప్తికి యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.వి.రావు, దామోదరరావు ఓ ప్రకటనలో హర్షం ప్రకటించారు.