కేంద్ర విద్యుత్ సవరణ చట్టంతో విద్యుత్ రంగం సర్వనాశనమవుతుంది

విధాత‌: కేంద్ర విద్యుత్ చట్ట సవరణలతో కార్పొరేట్ కబంధహస్తాల చేతుల్లోకి విద్యుత్ రంగం వెళుతుంది,ప్రజలపై భారాలు, విద్యుత్ ఉద్యోగుల భద్రతకు ముప్పు.మోడీ మానిటైజేషన్ పాలసీతో ప్రభుత్వ ఆస్తులకు ఎసరు.కేంద్ర ప్రభుత్వ ప్రమాదకర సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలి,రాష్ట్రంలో పెంచిన విద్యుత్ భారాలు తగ్గించాలి.ఈ నెల 27వ తేదీన కేంద్ర విధానాలపై జరిగే భారత్ బంద్ కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలకాలని నేడు విజయవాడలోని విద్యుత్ సౌధ వద్ద విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు, ప్రజలపై భారాల కు […]

  • Publish Date - September 9, 2021 / 09:29 AM IST

విధాత‌: కేంద్ర విద్యుత్ చట్ట సవరణలతో కార్పొరేట్ కబంధహస్తాల చేతుల్లోకి విద్యుత్ రంగం వెళుతుంది,ప్రజలపై భారాలు, విద్యుత్ ఉద్యోగుల భద్రతకు ముప్పు.మోడీ మానిటైజేషన్ పాలసీతో ప్రభుత్వ ఆస్తులకు ఎసరు.కేంద్ర ప్రభుత్వ ప్రమాదకర సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలి,రాష్ట్రంలో పెంచిన విద్యుత్ భారాలు తగ్గించాలి.ఈ నెల 27వ తేదీన కేంద్ర విధానాలపై జరిగే భారత్ బంద్ కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలకాలని నేడు విజయవాడలోని విద్యుత్ సౌధ వద్ద విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు, ప్రజలపై భారాల కు నిరసనగా ఆందోళన, కరపత్రాల పంపిణీ చేశారు సీపీఐ నాయ‌కులు.

మధు, బాబూరావు మాట్లాడుతూ..

కేంద్ర విద్యుత్ సవరణ చట్టంతో విద్యుత్ రంగం సర్వనాశనమవుతుంది.విద్యుత్ రంగంలోని అన్ని విభాగాలు ప్రైవేటుపరం అవుతాయి.ప్రజలపై విద్యుత్ భారాలు పెరుగుతాయి. ఉచిత విద్యుత్ కు ఎసరు పెడుతున్నారు.రైతులు, దళితులు, పేదల ఇచ్చే విద్యుత్ సబ్సిడీలు రద్దు అవుతాయి.మోడీ ప్రభుత్వం ప్రకటించిన మానిటైజేషన్ పైప్ లైన్ పాలసీతో సర్వ రంగాలు నాశనం అవుతాయి.ఆస్తుల అమ్మకం కంటే లీజు విధానం మరింత ప్రమాదకరం. కారుచౌకగా అంబానీ, అదానిలకు ప్రభుత్వ ఆస్తులని కట్టబెట్టడానికి కేంద్రం కుట్ర పన్నింది.సాగు చట్టాలు, విద్యుత్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీన రైతు సంఘాల పిలుపు మేరకు భారత్ బంద్ జరుగుతుంది.రాష్ట్ర ప్రభుత్వం, అన్ని రాజకీయ పార్టీలు ఈ బంద్ కు మద్దతు ప్రకటించాలి.రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్రంపై ముఖ్యమంత్రి జగన్ నోరువిప్పాలి.రాష్ట్రంలో పెంచిన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను
ఉపసంహరించాలి.నేడు విద్యుత్ సౌధ వద్ద విద్యుత్ ప్రైవేటీకరణకు, కేంద్ర విద్యుత్ చట్ట సవరణకు వ్యతిరేకంగా నిరసన, కరపత్రాల పంపిణీ జరిగింది.ఈ కార్యక్రమంలో మధు ,బాబు రావుతో పాటు సిపిఎం నేతలు డి. కాశీనాథ్, బి.నాగేశ్వరరావు,హరినారాయణ, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Latest News