అమరావతి : కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతిరాజును సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె. నారాయణ అభినందనలతో ముంచెత్తారు. ఆయన రాజకీయాల్లో ఉంటూ కూడా ఆదాయాన్ని సమకూర్చుకోకపోగా, తనకున్న సొంత ఆస్తి నుండి రూ.1000 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వడాన్ని సీపీఐ అభినందిస్తుందని తెలిపారు. ఆ భూమిలో ఏవియేషన్ కు సంబంధించిన సెంటర్స్ ఏర్పాటు చేయమన్నారని గుర్తు చేశారు.
ఈ రోజుల్లో రాజకీయాల్లో రూపాయి పెట్టుబడి పెట్టి రూ.100 కోట్లు సంపాదించే పరిస్థితి ఉండగా, అశోక గజపతిరాజు 1000 కోట్ల రూపాయల విలువైన తన సొంత భూమిని ఇవ్వటం ద్వారా రాజకీయాల్లో ఆదర్శంగా నిలిచారని నారాయణ కొనియాడారు. నేడు సమాజంలో విలువలు దిగజారి పోతున్నాయని, అవినీతిని పరాకాష్టకు చేరింది అని..ఈ పరిస్థితుల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడే రాజకీయ నాయకులు అశోక్ గజపతి రాజు సేవలను చూసి సిగ్గుతో తలదించుకోవాలన్నారు. సమాజం అశోక గజపతి రాజును అభినందించాలని నారాయణ సూచించారు.
ఇవి కూడా చదవండి :
Harish Rao : కేసీఆర్ విమర్శలతో సీఎం రేవంత్ రెడ్డి ఆగమాగం
పార్టీ మనుగడకే కేసీఆర్ తోలు మాటలు : మంత్రుల ఎదురుదాడి
