కేంద్రం తానా అంటే తందానా అంటూ భయంతో తిరుగుతున్న వ్యక్తి జగన్

విధాత‌: జగన్ రెడ్డి పాలన అంతా నా ఇష్టం అన్న విధంగా సాగుతోందని వెల్ల‌డించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ.వైసిపి ప్రజాప్రతినిధులు రాష్ట్రాన్ని దోచేస్తున్నారు,వైసిపి ప్రభుత్వం ప్రమాదకరంగా మారింది.జగన్ పాలన రివర్స్ పాలన.ప్రభుత్వంతో ఒప్పందం అంటేనే కాంట్రాక్టర్లు భయపడి పోతున్నారు.ఏపీలో రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది,గత రెండు సంవత్సరాల్లో రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఎందుకు చెల్లించ లేదు.సిఎం ప్రమాణ స్వీకార మహోత్సవంలో జగన్ చెప్పిందొకటి..చేసేదిమరొకటి. అర్హులైన వారి పెన్షన్లను ఎందుకు రద్దు చేశారు..?విద్యుత్ ఛార్జీల పెంపుపై […]

  • Publish Date - September 7, 2021 / 03:39 PM IST

విధాత‌: జగన్ రెడ్డి పాలన అంతా నా ఇష్టం అన్న విధంగా సాగుతోందని వెల్ల‌డించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ.వైసిపి ప్రజాప్రతినిధులు రాష్ట్రాన్ని దోచేస్తున్నారు,వైసిపి ప్రభుత్వం ప్రమాదకరంగా మారింది.జగన్ పాలన రివర్స్ పాలన.ప్రభుత్వంతో ఒప్పందం అంటేనే కాంట్రాక్టర్లు భయపడి పోతున్నారు.ఏపీలో రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది,గత రెండు సంవత్సరాల్లో రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఎందుకు చెల్లించ లేదు.సిఎం ప్రమాణ స్వీకార మహోత్సవంలో జగన్ చెప్పిందొకటి..చేసేదిమరొకటి.

అర్హులైన వారి పెన్షన్లను ఎందుకు రద్దు చేశారు..?విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈ నెల 9న విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం.విద్యుత్ ఛార్జీల పెంపు, రోడ్ల దుస్థితి, పెన్షన్ రద్దుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం.పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించడంలో ఎపి ప్రభుత్వం విఫలమైంది.కేంద్రం తానా అంటే తందానా అంటూ భయంతో తిరుగుతున్న వ్యక్తి జగన్.విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఈనెల 14వతేదీన అనంతపురంలో పాదయాత్ర ప్రారంభించి విశాఖలో పూర్తి చేస్తాం.ఈ నెల 21న విశాఖలో విశాఖ ఉక్కుపై భారీ బహిరంగసభ