నత్తనడకన అభివృద్ధి పనులు, శరవేగంతో పన్నుల భారాలు

ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి, పన్నుల భారాల రుద్దటంలో మునిగితేలుతున్న మున్సిపాలిటీలు, అధికార యంత్రాంగం ఆస్తి పన్ను పెంపు ,చెత్త పన్ను భారాలపై ప్రజా నిరసనలకు భయపడి పోలీసుల నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వ ఒత్తిళ్ళకు లొంగి మున్సిపల్ కౌన్సిళ్ల లో తీర్మానాలు చేస్తున్న పాలక పక్షాలు ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్ను విధింపుపై నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన దీక్షలు ప్రారంభం విధాత‌:విజయవాడలో దీక్షను ప్రారంభించిన పౌర సమాఖ్య […]

  • Publish Date - July 18, 2021 / 01:35 PM IST
  • ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి, పన్నుల భారాల రుద్దటంలో మునిగితేలుతున్న మున్సిపాలిటీలు, అధికార యంత్రాంగం
  • ఆస్తి పన్ను పెంపు ,చెత్త పన్ను భారాలపై ప్రజా నిరసనలకు భయపడి పోలీసుల నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న ప్రభుత్వం
  • రాష్ట్రప్రభుత్వ ఒత్తిళ్ళకు లొంగి మున్సిపల్ కౌన్సిళ్ల లో తీర్మానాలు చేస్తున్న పాలక పక్షాలు
  • ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్ను విధింపుపై నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన దీక్షలు ప్రారంభం

విధాత‌:విజయవాడలో దీక్షను ప్రారంభించిన పౌర సమాఖ్య కన్వీనర్ సిహెచ్ బాబురావు క‌రోనా కట్టడినీ గాలికొదిలేసి పన్నుల భారాలను జెట్ స్పీడ్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయ‌న్నారు.
పన్ను పోటుపై కేంద్రం షరతులకు రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయింది.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు మున్సిపల్ పాలక వర్గాలు తలొగ్గాయి.పన్నుల పేరుతో ప్రజలను బలి చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. మున్సిపల్ ఎన్నికలలో వైసీపీని గెలిపించిన ప్రజలకు పన్నుల పేరుతో చుక్కలు చూపిస్తున్నారు ప్రజా ప్రతినిధులు. సంక్షేమ పథకాల కొరకు ఓటు వేస్తే పన్నుల భారాలు వేస్తూ ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారు పాలకులు. మున్సిపల్ ఎన్నికలకు ముందు పన్నులు పెంచమని హామీ ఇచ్చి నేడు మోయలేని భారాలను వేస్తున్న పాలక పక్షం. చెత్త పన్ను చెల్లించాలని లేదంటే
సంక్షేమ పథకాల నిలిచిపోతాయని లబ్ధిదారులను, ప్రజలను హెచ్చరికలతో వాలంటీర్లు బెదిరిస్తున్నారు.మున్సిపాలిటీల్లో పాలకపక్షాలు గెలుపొంది నాలుగు నెలలు గడిచినా అభివృద్ధి పనులు వీశమెత్తు ముందుకు సాగటం లేదు.

పేరుకుపోయిన ప్రజాసమస్యలు అనేకం ఉన్నాయి.చిన్నపాటి వర్షాలకు మునిగిపోతున్న రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతున్నాయి.కరోనా సమయంలోనూ ప్రజారోగ్యం క్షీణిసస్తుందని అన్నారు.ఇవేవీ పట్టించుకోకుండా మునిగితేలుతున్న పాలకులు, అధికార యంత్రాంగం.ప్రభుత్వాలు ప్రజాందోళనలకు భయపడి నిరంకుశంగా అణిచివేస్తున్నాయి. విజయవాడ కార్పొరేషన్ కార్యాలయంలో వామపక్ష ,ప్రతిపక్ష కార్పొరేటర్ల అరెస్టు చేయడం ప్రభుత్వ నిర్బంధానికి పరాకాష్ట.పాలకపక్షాలు మున్సిపల్ కౌన్సిళ్లలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులతో ప్రజల నిరసనలను అణిచివేస్తున్న పోలీసులు ఈ నిర్బంధాలను అధిగమిస్తూ పన్నుల పెంపుపై ప్రజా ఆందోళన కొనసాగిస్తామన్నారు.ఈ రోజు నుండి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలలో నిరసన దీక్షలు జరుగుతాయని తెలిపారు. ఇప్పటికే పలు పట్టణాల్లో నిరసనలు ప్రారంభమైనాయని అన్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు ఉద్యమం ఆగదన్నారు. విజయవాడ మొగల్రాజపురంలో 6,7 డివిజన్లలో పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బాబూరావు తో పాటు సిఐటియు నేత బి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.