ANDRAPRADESH | ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశారా..?ఐపీఎస్‌ల మెమోల వెనుక సంచలన విషయాలు
ఏపీలో వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు మెమో జారీ వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా కొందరు ఐపీఎస్‌లు కుట్ర చేసినట్లు నిఘా విభాగం గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో ఆ ఐపీఎస్‌లకు మెమోలు జారీ చేశారని తెలుస్తుంది.
విధాత, హైదరాబాద్ : ఏపీలో వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌ల(IPS)కు మెమో జారీ వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా కొందరు ఐపీఎస్‌లు కుట్ర(IPS is a conspiracy) చేసినట్లు నిఘా విభాగం గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో ఆ ఐపీఎస్‌లకు మెమోలు(Memos to IPS) జారీ చేశారని తెలుస్తుంది. ఇంటలిజెన్స్ సమాచారం(Intelligence information)తో అప్రమత్తమైన డీజీపీ కార్యాలయం వెయిటింగ్‌లో ఉనల్న 16 మంది ఐపీఎస్‌లను నిత్యం డీజీపీ కార్యాలయం(DGP office) వచ్చి సాయంత్రం వరకు ఇక్కడే ఉండాలన్న మెమోలు జారీ చేసిందన్న ప్రచారం జోరందుకుంది. కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న కేసుల్లో సదరు ఐపీఎస్‌లు తమ పేర్లతో పాటు వైసీపీ ప్రముఖ నేతల ప్రమేయాన్ని తక్కువ చేసి చూపేలా, కేసులను తప్పుదో పట్టించేలా విచారణాధికారులను ప్రభావితం చేసినట్లుగా నిఘా విభాగం గుర్తించింది. నిఘా విభాగం సమాచారంతో మేల్కోన్న ప్రభుత్వ పెద్దలు ఐపీఎస్‌లు వెయిటింగ్‌లో ఉండి కూడా వైసీపీకి అనుకూలంగా(In favor of YCP) పావులు కదుపుతున్న తీరు చూసి ఖంగుతిని, వారికి మోమోల జారీకి డీజీపీని పురమాయించినట్లుగా భావిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram