ఆప‌ద‌లో వున్న‌ మ‌హిళ‌ల‌ను కాపాడే అస్త్రం దివ యాప్

విధాత‌:విజయవాడ హనుమాన్ పేటలోని ఆలపాటి కళ్యాణ వేదికలో దిశా యాప్ వినియోగంపై విస్తృత సమావేశం.కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు , సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు , తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి దేవినేని అవినాష్ , మేయర్ రాయన భాగ్యలక్ష్మి , పోలీస్ ఉన్నతాధికారులు, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు.మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది.రాష్ట్ర వ్యాప్తంగా మహిళల రక్షణ కోసం 18 దిశ […]

  • Publish Date - July 28, 2021 / 04:16 AM IST

విధాత‌:విజయవాడ హనుమాన్ పేటలోని ఆలపాటి కళ్యాణ వేదికలో దిశా యాప్ వినియోగంపై విస్తృత సమావేశం.కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు , సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు , తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి దేవినేని అవినాష్ , మేయర్ రాయన భాగ్యలక్ష్మి , పోలీస్ ఉన్నతాధికారులు, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు.మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది.రాష్ట్ర వ్యాప్తంగా మహిళల రక్షణ కోసం 18 దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేసి, దిశ చట్టాన్ని కూడా అమలు చేస్తున్నాం,ప్రతి మహిళ సెల్ ఫోన్లో దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్. మ‌హిళా పోలీసులు, వార్డు వాలంటీర్ల ద్వారా యాప్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.రాష్ట్రంలో స్మార్ట్ ఫోన్‌ ఉండే ప్రతి మహిళ వద్ద దిశ యాప్ ఉండాలన్నారు.