విధాత:పోవలరం ప్రాజెక్ట్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ఖాళీ చేయించవద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది.ప్రాజెక్ట్ పరిధిలోని తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాల్లో వివిధ గ్రామాల గిరిజన నిర్వాసితులను అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని పేర్కొంటూ ‘ శక్తి ‘ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ డాక్టర్ పి.శివరామకృష్ణ హైకోర్టులో పిల్ వేయగా వాదనలు విన్న ధర్మాసనం అధికారులకు, అథార్టీకి తగిన ఆదేశాలు జారీ చేసింది.