DRUGS CASE | డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయి అరెస్టు.. ఫోన్‌లో అమ్మాయిల వీడియోలు
హైదరాబాద్ వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయిని పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లాలో దర్గాలో తలదాచుకున్న మస్తాన్ సాయిని ఏపీ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయిని పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లాలో దర్గాలో తలదాచుకున్న మస్తాన్ సాయిని ఏపీ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. జూన్ 3న విజయవాడ రైల్వే స్టేషన్‌లో డ్రగ్స్ తరలిస్తున్న క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకున్న మస్తాన్ సాయి అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. రెండు సార్లు డ్రగ్స్ కేసులో పట్టుబడిన మస్తాన్ సాయి బెయిల్‌పై బయటకు వచ్చి తిరిగి అదే దందా కొనసాగిస్తున్నాడు. గుంటూరులో అరెస్టయిన మస్తాన్ సాయి ఫోన్‌లో అనేక మంది అమ్మాయిల ప్రైవేటు వీడియోలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అమ్మాయిల ప్రైవేటు వీడియోలను తీసి మస్తాన్ సాయి బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రధానంగా ఏపీ, తెలంగాణ అమ్మాయిలపైనే మస్తాన్ సాయి వల వేసినట్లుగా తెలుస్తుంది. మస్తాన్ సాయిపై ఇటీవల హీరో రాజ్ తరుణ్ కేసులో లావణ్య ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటిదాకా మస్తాన్ సాయికి కేవలం డ్రగ్ పెడ్లర్‌గానే భావించగా, ఇప్పుడు అమ్మాయిల వీడియోలతో ఈ కోణంలోనూ అతని నేరాలపై పోలీసులు విచారణ చేపట్టారు.