పులిచింతల సమీపంలో భూప్రకంపనలు…

విధాత‌: గుంటూరు జిల్లా పులిచింతల సమీపంలో భూప్రకంపనలు వచ్చాయి. ఆదివారం ఉదయం 7.15 గంటల నుంచి 8.20 గంటల వరకు భూమి కంపించినట్లు భూభౌతిక పరిశోధన ముఖ్యశాస్త్రవేత్త శ్రీనగేశ్‌ తెలిపారు. మూడు సార్లు భూమి కంపించినట్లు చెప్పారు. భూకంపలేఖినిపై దీని తీవ్రత 3.0, 2.7, 2.3గా నమోదైనట్లు ఆయన వివరించారు. పులిచింతలతోపాటు తెలంగాణ పరిధిలోని చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లోనూ భూ ప్రకంపలను వచ్చాయి. గతవారం రోజులుగా పులిచింతల సమీపంలో భూ ప్రకంపనలు వస్తున్నట్లు అధికారులు తెలిపారు.

  • Publish Date - August 8, 2021 / 03:30 PM IST