జనసేన బలోపేతానికి కృషి చేయాలి…

విధాత‌:జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు..సగటు ప్రజల కన్నీళ్లు తుడిచివేయడంతో పాటు ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు జనసేన పార్టీ అహర్నిశలు కృషి చేస్తోందని జనసేనాని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరి లోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశానికి పవన్ హాజరై కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. తొలుత కరోనా తో మృతులకు నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.అనంతరం ఇటీవల మృతి చెందిన నంధ్యాలకు చెందిన జనసైనికుడు ఆకుల సోమశేఖర్ కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల […]

  • Publish Date - July 7, 2021 / 11:13 AM IST

విధాత‌:జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు..సగటు ప్రజల కన్నీళ్లు తుడిచివేయడంతో పాటు ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు జనసేన పార్టీ అహర్నిశలు కృషి చేస్తోందని జనసేనాని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరి లోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశానికి పవన్ హాజరై కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.

తొలుత కరోనా తో మృతులకు నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.అనంతరం ఇటీవల మృతి చెందిన నంధ్యాలకు చెందిన జనసైనికుడు ఆకుల సోమశేఖర్ కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల చెక్కును జనసేనాని తన చేతుల మీదుగా అందజేశారు..అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… కరోనా విపత్తు కారణంగా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను కోల్పోయారని, రాష్ట్రంలో ఎంతో మంది జనసైనికులు సైతం కరోనా భారినపడి మృతి చెందడం తననెంతో కలచివేసిందన్నారు..కరోనాతో కష్ట,నష్టాలను ఎదుర్కొంటూనే ప్రజలకు జనసైనికులు తమ వంతు అండగా నిలవడం అభినందనీయమని కొనియాడారు.

నేటి ధన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో పార్టీని నడపడం చాలా సాహసోపేత నిర్ణయమని, మీ అందరి ఆదరణతోనే పార్టీని నడపగలుగుతున్నామని చెప్పారు. భవిష్యత్తు లో జనసేన పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయాలని కోరారు..జనసేన పార్టీ రాష్ట్ర నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… జనసేన పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు క్రియాశీలక సభ్యత్వం పొందిన లక్ష మంది కార్యకర్తలకు రూ.2లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు..కరోనా కారణంగా పార్టీకి చెందిన ఎంతో మంది యువతను సైతం కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు.