Kurnool | కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
Kurnool | ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం మండలం చిలకల డోనా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
Kurnool | ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం మండలం చిలకల డోనా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. బొలెరో – రెడీమిక్స్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులందరూ కర్ణాటకకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఐదుగురు మహిళలు, బాలిక ఉన్నారు.
రోడ్డు ప్రమాదం తీవ్రత ఘోరంగా ఉంది. రెడిమీక్స్ లారీ పూర్తిగా ఒక పక్కకు ఒరిగింది. బోలెరో వాహనం పల్టీలు కొట్టింది. ఈ వాహనాలు టైర్లు కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ప్రమాదంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు తీవ్రంగా శ్రమించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram