" /> " /> " /> " />
విధాత: ప్రకాశం జిల్లా గ్రానెట్ పరిశ్రమ ఘోష జగన్ రెడ్డికి…వినిపిస్తోందా?,పాదయాత్ర సమయంలో గ్రానెట్ ప్రతినిధులతో “నేనున్నాను, నేను విన్నాను అని హామీనిచ్చిన జగన్ రెడ్డి నేడు ఏమయ్యారు? అన్నారు ఏలూరు సాంబశివరావు.ప్రకాశం జిల్లాకే తలమానికంగా ఉన్న గ్రానైట్ పరిశ్రమ, నేడు సవాలక్ష సమస్యలతో సతమతమతుంది. రాజకీయ కక్ష పూరిత నిర్ణయాలతో జిల్లాలో 400కు పైగా గ్రానెట్ పరిశ్రమలు,క్వారీలు మూత పడ్డాయి. వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.
వైసీపీ నాయకులు గ్రానైట్ రవాణా, నకిలీ వే బిల్లులు వంటి అనేక సమస్యలతో గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. గ్రానైట్ అక్రమ రవాణా వ్యవహారంలో అధికార పార్టీ నేతలకు, పలు శాఖల అధికారులు అవినీతి ఊబిలో కూరుకు పోతున్నారు.గ్రానైట్ పరిశ్రమ యాజమాన్యాలపై రాజకీయ కక్షసాధింపు చర్యలు మానుకోవాలి.రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వేల కోట్ల రూపాయలు పెనాల్టీలు వేస్తున్నట్లు షో చేసి వారికి దాసోహం అయిన వారిని వ్యాపారం చేసుకునేలా లోపాయికారిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.