విధాత: దుప్పటి అడిగిందన్న కారణంతో ఓ విద్యార్థిని ఉన్నపళంగా రాత్రి వేళ హాస్టల్ నుంచి బయటకు పంపించిన వార్డెన్ నిర్వాకం వైరల్ గా మారింది. ప్రభుత్వ గురుకులాలు, హాస్టల్స్ లో విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది.
ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్‌లో 8వ తరగతి విద్యార్థిని అక్షయ రాత్రి వేళ చలికి తట్టుకోలేక.. తనకు దుప్పటి కావాలని హాస్టల్ వార్డెన్‌ను అడిగింది. దీంతో కోపాద్రిక్తురాలైన వార్డెన్ ఇంటికెళ్లి పడుకో అని చెప్పి రాత్రి 10 గంటల సమయంలో బలవంతంగా హాస్టల్ నుంచి బయటకు పంపించేసింది.
సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆ రాత్రి సమయంలో హుటాహుటిన బయలుదేరి హాస్టల్ వద్దకు చేరుకుని, వార్డెన్ తీరుపై మండిపడి.. తమ కూతురు అక్షయను వెంట తీసుకెళ్లారు. విద్యార్ధిని పట్ల వార్డెన్ వ్యవహరించిన తీరు పట్ల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి, దీనిపై విచారణ చేసి వార్డెన్ పై చర్యలు తీసుకోవాని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన విద్యార్ధులలో హాస్టల్స్ పట్ల నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
దుప్పటి అడిగిన పాపానికి.. విద్యార్థిని హాస్టల్ నుంచి పంపించిన వార్డెన్
ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్‌లో వెలుగు చూసిన దారుణ ఘటన
రాత్రి వేళ చలికి తట్టుకోలేక.. తనకు దుప్పటి కావాలని హాస్టల్ వార్డెన్‌ను అడిగిన 8వ తరగతి విద్యార్థిని అక్షయ
దీంతో… pic.twitter.com/GlhCZIjgRL
— PulseNewsBreaking (@pulsenewsbreak) June 28, 2026
