విధాత: ప్రభుత్వం ప్రజలకి ఎంత దూరమైందో ఈ ఆందోళనతో తేటతెల్లమవుతోంది. ప్రజావ్యతిరేకత ఎలా వెల్లువెత్తుతుందో ఆ తాండా వాసులు ఆగ్రహంలో వెల్లడవుతోంది. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలం గొల్లపల్లి తాండా సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే నుంచి అధికారుల వరకూ ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆందోళనకి దిగారు.