ఎగుమతి, దిగుమతుల్లో గంగవరం పోర్టు రికార్డు
విధాత,విశాఖపట్నం : దేశంలోనే లోతైన, అత్యాధునిక నౌకాశ్రయాల్లో ఒకటిగా ఉన్న గంగవరం పోర్టు బాక్సైట్ దిగుమతి, ఇనుము ముడిఖనిజం ఎగుమతుల్లో రికార్డు సాధించినట్లు పోర్టు యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. కేవలం 24 గంటల్లో 1,25,380 టన్నుల బాక్సైట్‌ను మెకానికల్ అన్‌లోడింగ్ సిస్టం వినియోగించి దిగుమతి చేశామని వివరించింది. ఎంవీఆర్ బెర్జ్ అపో నౌక 1,65,598 టన్నుల బాక్సైట్‌ను తీసుకుని పోర్టుకు చేరుకోగా.. ఇంత పెద్ద మొత్తంలో సరకు దిగుమతి చేయడం ఇదే తొలిసారని తెలిపింది. అలాగే […]

విధాత,విశాఖపట్నం : దేశంలోనే లోతైన, అత్యాధునిక నౌకాశ్రయాల్లో ఒకటిగా ఉన్న గంగవరం పోర్టు బాక్సైట్ దిగుమతి, ఇనుము ముడిఖనిజం ఎగుమతుల్లో రికార్డు సాధించినట్లు పోర్టు యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. కేవలం 24 గంటల్లో 1,25,380 టన్నుల బాక్సైట్‌ను మెకానికల్ అన్‌లోడింగ్ సిస్టం వినియోగించి దిగుమతి చేశామని వివరించింది. ఎంవీఆర్ బెర్జ్ అపో నౌక 1,65,598 టన్నుల బాక్సైట్‌ను తీసుకుని పోర్టుకు చేరుకోగా.. ఇంత పెద్ద మొత్తంలో సరకు దిగుమతి చేయడం ఇదే తొలిసారని తెలిపింది.
అలాగే గంగవరం పోర్టులో ఎగుమతి విధానాన్ని మార్పు చేయడం ద్వారా ఇనుము ముడి ఖనిజం ఎగుమతి పరంగా మరో రికార్డు సాధించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎంవీ నైట్ స్కై నౌక పోర్టుకు రాగానే… కేవలం నాలుగున్నర గంటల్లో మాన్యువల్, ఎంహెచ్‌సీ (మెకానికల్, షిప్‌లోడర్ ఏకకాలంలో వినియోగిస్తూ. పద్ధతుల్లో ఐరన్ ఓర్ ఫైన్స్ డిఫికల్ట్ గ్రేడును ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేసి మరో రికార్డు సొంతం చేసుకున్నట్టు తెలిపారు.